Reading Time: < 1 minute
Dhurandhar 2 Advance Bookings Records Ranveer Singh Movie Tickets

రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమైంది. నిన్న విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగానే, మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి ఫ్యాన్స్‌కు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రీమియర్ షోల కోసం బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే ఏకంగా 86,680 కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం ప్రీమియర్స్ కోసమే ఈ రేంజ్ లో జనం ఎగబడుతున్నారంటే, ఇక ఫుల్ లెవల్ బుకింగ్స్ మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Also Read : Chiranjeevi NTR National Award: మెగాస్టార్‌కు ఎన్టీఆర్ అవార్డు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్!

మొదటి పార్ట్ రూ. 1,350 కోట్లు కొల్లగొట్టడంతో, ఈ సీక్వెల్ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మొదటి భాగం కంటే ఈసారి డోస్ పెంచినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ ఉండటంతో సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను మార్చి 19న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నిడివి దాదాపు 4 గంటల వరకు ఉండటం ఒక విశేషం. ఇంత లెంగ్త్ ఉన్నా సరే, ఆడియన్స్ టికెట్ల కోసం క్యూ కడుతున్నారంటే ఆదిత్య ధర్ మేకింగ్‌పై ఉన్న నమ్మకం అలాంటిదని చెప్పాలి. మార్చి 18 సాయంత్రం 5 గంటల నుంచే పెయిడ్ ప్రివ్యూస్ ఉండటంతో, టాక్ ఎలా వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.