Reading Time: < 1 minute
India Post Gds Result 2026 First List Of Shortlisted Candidates Released

ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలకు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. 28,636 GDS పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in లో మొదటి మెరిట్ జాబితాను చెక్ చేసుకోవచ్చు. సర్కిల్ వారీగా PDF మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. నియామక ప్రక్రియలో రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండవు. ఎంపిక పూర్తిగా 10వ తరగతి మార్కుల ఆధారంగా ఉంటుంది. కంప్యూటర్ ద్వారా జనరేటెడ్ మెరిట్ జాబితాను తయారు చేస్తారు. దీనిలో గ్రేడ్‌లు లేదా పాయింట్లను శాతాలుగా మారుస్తారు.

Also Read:Megastar Chiranjeevi: మెగాస్టార్ ఖాతాలో మరో అవార్డ్.. అగ్ర నటుడికి అత్యున్నత గౌరవం

ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి నాలుగు దశాంశ స్థానాల వరకు కాలిక్యులేషన్స్ నిర్వహిస్తారు. సెకండరీ స్కూల్ పరీక్షలో ఎక్కువ స్కోర్లు సాధించిన అభ్యర్థులు మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 23/03/2026న లేదా అంతకు ముందు వారు ఎంపిక అయిన డివిజన్‌లోని డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్స్, 2 సెట్ల ఫోటోకాపీలతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ GDS రిజల్ట్స్ 2026 మొదటి మెరిట్ జాబితాను తనిఖీ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.