Reading Time: < 1 minute
Ranveer Singh Dhurandhar 2 Trailer Release Updates Box Office Records

గత ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 1,350 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్, ట్రైలర్‌తోనే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ ట్రైలర్‌లో రణ్‌వీర్ సింగ్ ఊరమాస్ లుక్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను అలరిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న ఎమోషన్‌కు మించి, ఈసారి రివెంజ్ డ్రామాను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఆదిత్య ధర్ టేకింగ్, విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండటం విశేషం. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

Also Read : Vishwanath Sons: సూర్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ ట్రీట్!

జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, అంతకంటే ముందే అంటే మార్చి 18న సాయంత్రం 5 గంటల నుంచే దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రివ్యూస్ నిర్వహించబోతున్నారు. దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ట్రైలర్ ఇంప్యాక్ట్ చూస్తుంటే, మొదటి రోజే అన్ని రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి.