July 9, 2026

Thala For A Reason: 7 వికెట్లు, 7 పరుగులు.. భారత్ విజయంలో ‘7’ సెంటిమెంట్.. ధోని ఫ్యాన్స్ ఫిదా?

Thala For A Reason: 7 వికెట్లు, 7 పరుగులు.. భారత్ విజయంలో ‘7’ సెంటిమెంట్.. ధోని ఫ్యాన్స్ ఫిదా?
Reading Time: 2 minutes
Ms Dhoni Jersey Number 7 Coincidence India Vs England T20 World Cup Semi Final

MS Dhoni- India vs England: టీమిండియా మరో టీ20 వరల్డ్ కప్‌ గెలుచుకునేందుకు అడుగు దూరంలో ఉంది. నిన్న సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. పూర్తి జట్టు సహాయ సహకారాల వల్ల ఇది సాధ్యమైంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ యాదృచ్ఛికమైన ఘటన జరిగింది. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ స్కోర్ 253/7, ఇంగ్లాండ్ స్కోర్ 246/7. ఇక్కడ రెండు టీమ్‌లు వికెట్ల(7) చొప్పున కోల్పోయాయి. భారత్ ఏడు(7) పరుగుల తేడాతో గెలిచింది. మూడింటిలో ఏడు కామన్‌గా ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని జర్సీ నంబర్ కూడా 7 కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ.. అభిమానులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సమాచారం వైరల్‌గా మారింది.

READ MORE: Avika Gor : తల్లి కాబోతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’? వైరల్ అవుతున్న అవికా గోర్ లేటెస్ట్ వీడియో!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. ఐసీసీ ట్రోఫీలు మాత్రమే కాకుండా ఐపీఎల్‌లోనూ మహి అద్భుత ప్రతిభ కనబరిచాడు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఇక జర్నీ విషయానికి వస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు, మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ మ్యాచ్‌లలో జెర్సీ నంబర్ 7 ధరించి ఆడుతున్నాడు. అయితే మహి జెర్సీ నంబర్-7 రహస్యం ఏంటో తెలుసా? నిజానికి మహేంద్ర సింగ్ ధోని స్వయంగా తన జెర్సీ నంబర్-7ను వెల్లడించాడు. 7వ నంబర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఎలా ఉందో చెప్పాడు. మహి తాను జూలై 7వ తేదీన పుట్టానని చెప్పాడు. సంవత్సరంలో జూలై 7వ నెల. తాను పుట్టిన సంవత్సరం 81… 8లో నుంచి 1 తీసివేస్తే 7. కాబట్టి ఈ కారణాలన్నింటి వల్ల తాను తన జెర్సీ నంబర్‌గా 7ని ఎంచుకున్నట్లు తెలిపాడు.