Reading Time: 2 minutes
Cm Revanth Reddy Blesses Vijay Deverakonda Rashmika Mandanna Wedding

CM Revanth Reddy: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఒక్కటైన వేళ, వారి ఇంట సందడి అంబరాన్ని అంటుంది. ఇటీవల రాజస్థాన్‌లో వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంటను ఆశీర్వదించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా వారి నివాసానికి వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయ్ నివాసానికి చేరుకుని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులకు పూలబోకే అందజేసి ఆశీర్వదించిన సీఎం, అనంతరం విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను విజయ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ.. “తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చి ఆశీర్వదించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు.

Vijay Deverakonda3

READ ALSO: India vs England: సెమీఫైనల్లో సంజు శాంసన్ విశ్వరూపం.. సెంచరీ చేజారిన చెరిగిపోని రికార్డు!

ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్‌లో ఉదయం 10:10 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం, సాయంత్రం రష్మిక కుటుంబ ఆచారాల ప్రకారం విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల పెళ్లి రెండుసార్లు వివాహం జరిగింది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ప్రస్తుతం విజయ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట పెళ్లి ఫోటోలు చూసి అభిమానులు సోషల్ మీడియాలో లైక్‌లు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

Vijay Deverakonda 2

 

READ ALSO: Namakkal Egg Exports: కుప్పకూలిన గుడ్డు ధరలు.. రోజుకు రూ.5 కోట్ల నష్టం!