Reading Time: 2 minutes
Sanju Samson Father Emotional Video 97 Runs West Indies Match

Sanju Samson: భారత క్రికెట్ సంచలనం సంజు శాంసన్ వెస్టిండీస్‌పై ఆడిన అద్భుత ఇన్నింగ్స్ తన తండ్రి కళ్లలో ఆనంద బాష్పాలను నింపింది. సెమీఫైనల్‌కు ముందు వైరల్ అయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోతోంది. ముఖ్యంగా వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సంజు ఆడిన 97 పరుగుల (అజేయంగా) ఇన్నింగ్స్ భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చడమే కాకుండా, అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ కళ్లలో నీళ్లు తెప్పించింది. తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ ALSO: ATM Withdrawal Limit: ఆ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఏటీఎం విత్ డ్రా లిమిట్ 50 శాతం తగ్గింపు..

వెస్టిండీస్‌పై టీమిండియా గెలిచిన తర్వాత ఒక జాతీయ మీడియా ఛానల్‌తో మాట్లాడిన శాంసన్ విశ్వనాథ్, తన కొడుకు సక్సెస్ గురించి చెబుతూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. “వెస్టిండీస్‌తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేను మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు టీవీ ముందు నుంచి లేవలేదు. ఆ సమయంలో ఎవరి కాల్స్ లిఫ్ట్ చేయలేదు. నా కొడుకు బ్యాటింగ్ చూస్తూ పరవశించిపోయాను” అని ఆయన ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు కెరీర్‌లో ఎదుర్కొన్న ఆటంకాలు, విమర్శల గురించి గుర్తు చేసుకుంటూ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను నా జీవితంలో దేవుడిని ఏదైనా అడిగితే అది ఇదే మొదటిసారి. దేవుడా.. నా గౌరవాన్ని కాపాడు, నా కొడుకుకి ఒక్క అవకాశం ఇచ్చి సహాయం చేయి అని ప్రార్థించాను. ఈరోజు వాడు ఆడిన తీరు చూస్తుంటే నా జన్మ ధన్యమైంది అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.

సంజు శాంసన్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్
వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో సంజు శాంసన్ 97 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత్ సెమీఫైనల్‌లో అడుగుపెట్టి ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. సంజు నిలకడలేమిపై వస్తున్న విమర్శలకు ఈ ఇన్నింగ్స్‌తో చెక్ పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తండ్రి పడ్డ కష్టానికి, కొడుకు సాధించిన విజయానికి అద్దం పడుతున్న ఈ వీడియో క్లిప్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

READ ALSO: Karmani Selvam: మెగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘కార్మేని సెల్వం’.. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌తో సముద్రఖని క్రేజీ ప్రాజెక్ట్!