Reading Time: < 1 minute
Nitish Kumar Nomination For Rajya Sabha

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేశారు. పాట్నాలోని అసెంబ్లీలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Arjun Tendulkar Wedding: పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట.. హాజరైన ప్రముఖులు

నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్లుగా సోషల్ మీడియాలో బాంబ్ పేల్చారు. దీంతో బీహార్‌తో పాటు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనూహ్య నిర్ణయంపై పొలిటికల్‌గా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇంత సడన్‌గా రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో మతలబు ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక తదుపరి బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన వ్యక్తి రాబోతున్నారు. జేడీయూకు రెండు డిప్యూటీ సీఎం పోస్టులు దక్కనున్నాయి. మార్చి 16న ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం కైవసం చేసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Tejaswi Yadav: బీహార్‌లో జేడీయూ శకం ముగిసింది.. నితీష్‌ను బీజేపీ హైజాక్ చేసిందన్న తేజస్వి యాదవ్