Reading Time: < 1 minute
Bombay Hc Divorce Whatsapp Chats Cruelty Nashik Family Court

Divorce case: దంపతుల విడాకుల కేసుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేవలం ‘‘వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగ భర్తకు విడాకులు ఇవ్వలేము’’ అని చెప్పింది. భార్యకు తన వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా కింది కోర్టు మంజూరు చేసిన విడాకుల ఉత్తర్వుల్ని రద్దు చేసింది. హైకోర్టులో విచారణకు ముందు నాసిక్ ఫ్యామిలీ కోర్టు భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను అనుమతించింది. భర్త ఇచ్చిన వాంగ్మూలం, దంపతుల మధ్య వాట్సాప్, ఎస్ఎంఎస్ మెసేజ్‌ల ఆధారంగా విడాకులు మంజూరు చేసింది.

Read Also: Real Estate Scam: అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో కుచ్చుటోపీ.. మరో రియల్ ఎస్టేట్ ఘరానా మోసం వెలుగులోకి!

తన భార్య తనను పూణేకు మారాలని వేధిస్తోందని, తన తల్లిదండ్రుల్ని అవమానించిందని, తనను మానసిక వేధింపులకు గురిచేస్తోందని ఆయన కోర్టుకు వెల్లడించారు. అయితే, ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. కేవలం వాట్సాప్ చాట్స్ ఆదారంగా మాత్రమే క్రూరత్వాన్ని నిరూపించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘‘వాట్సాప్ సందేశాలపై మాత్రమే ఆధారపడి విడాకులు మంజూరు చేయలేం. భార్యకు కూడా తన వాదనల్ని వినిపించే అవకాశం ఇవ్వాలి’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును తిరిగి మళ్లీ నాసిక్ ఫ్యామిలీ కోర్టుకే తిప్పి పంపింది. ఇప్పుడు భార్యకు తన వాదనల్ని వినిపించే అవకాశం ఇవ్వాలని కింది కోర్టును ఆదేశించింది.