Reading Time: < 1 minute
Sonu Sood Helps Stranded Travelers In Dubai Free Stay Offer Viral

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాల్లో వేలాది మంది ప్రయాణికులు, ముఖ్యంగా భారతీయులు చిక్కుకుపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రియల్ హీరో సోనూసూద్ రంగంలోకి దిగారు. బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించి మరోసారి అందరి మనసు గెలుచుకున్నారు.

Also Read :Varalaxmi:అబ్బాయిల చెడ్డీ కనిపిస్తే ఓకే.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే తప్పా?

దుబాయ్‌లో చిక్కుకుపోయి వసతి దొరకక ఇబ్బంది పడుతున్న వారి కోసం సోనూసూద్ ఉచిత బస (Free Stay) సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.. ‘ఏ దేశస్థులైనా పర్వాలేదు, ఎటువంటి షరతులు లేకుండా మీరు ఉచితంగా బస చేయవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వం మాత్రమే ముఖ్యం’ అని సోనూసూద్ పేర్కొన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారు తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో మెసేజ్ చేస్తే, తన టీమ్ వెంటనే వారిని సంప్రదించి అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ భారతీయ విద్యార్థులను తీసుకురావడంలో సోనూసూద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్ళీ విదేశాల్లో చిక్కుకున్న వారికి అండగా నిలవడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ప్రభుత్వాలు చేయలేని పనిని సోనూసూద్ ఒంటరిగా చేస్తున్నారు’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.