Reading Time: 2 minutes
Ind Vs Eng Semi Final 2 T20 World Cup 2026 Who Will Face New Zealand In The Final

IND vs ENG: టీ20 వరల్డ్ కప్‌ 2026లో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. టోర్నీ సెమీఫైనల్-2లో నేడు భారత్–ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వానఖేడే స్టేడియం వేదికగా జరిగే ఈ పోరు ఫైనల్ బెర్త్‌ ను ఖరారు చేయనుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో ఫైనల్ లో న్యూజిలాండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధం అవుతుంది.

ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా, హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లాండ్ బరిలోకి దిగనున్నాయి. వరుసగా మూడో టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌ లో ఈ రెండు జట్లు తలపడటం విశేషం. గడించిన రెండు వరల్డ్ కప్ లలో.. 2022లో ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించి ఫైనల్ చేరగా, 2024లో గయానాలో దానికి భారత్ ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ చేయి కప్ ను సొంతం చేసుకుంది.

MLA Disqualification: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ తుది విచారణ.. కడియం, దానం కేసులపై స్పీకర్ కీలక నిర్ణయం..!

ఇకపోతే ఈ మ్యాచ్ లో వాతావరణం కూడా కీలక పాత్ర పోషించనుంది. ఒకవేళ వర్షం అడ్డంకిగా నిలిచి మ్యాచ్ నిలిచిపోతే రిజర్వ్ డేను కేటాయించారు. ఇందుకోసం గురువారం నాడు అదనంగా 90 నిమిషాలు, శుక్రవారం 120 నిమిషాల అదనపు సమయం ఉంది. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారు. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే సూపర్-8 పాయింట్ల పట్టిక ఆధారంగా ఫలితం నిర్ణయిస్తారు. ఆ పరిస్థితిలో సూపర్-8 గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ ఫైనల్‌కు అర్హత సాధించి న్యూజిలాండ్‌తో తలపడుతుంది. భారత్ సూపర్-8 గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచింది. కాబట్టి భారత్ టోర్నీ నుండి నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే నేడు ముంబైలో వర్షం పడే అవకాశాలు ఏమాత్రం లేవు. దీంతో పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

పిచ్ విషయానికి వస్తే.. ఈ టోర్నీలో ఈ గ్రౌండ్ లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్‌లో వెస్టిండీస్ 196 పరుగులు కాపాడుకోగా, మరో మ్యాచ్‌లో ఇటలీ 123 పరుగులకు నేపాల్‌ను ఆలౌట్ చేసి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై మరో హైస్కోరింగ్ థ్రిల్లర్ చూడొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తంగా ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడే జట్టు ఏదో నేడు తేలనుంది.

SA vs NZ: ఫిన్ అలెన్ అజేయ సెంచరీ.. న్యూజిలాండ్ 9 వికెట్ల భారీ విజయంతో ఫైనల్‌కు

ప్లేయింగ్ XI జట్లు: (అంచనా)

భారత్: సూర్యకుమార్ యాదవ్ (C), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ (W), శివం దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.

ఇంగ్లాండ్: హ్యారీ బ్రూక్ (C), రేహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జేకబ్ బెతెల్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.