Reading Time: < 1 minute

ఢిల్లీతో సహా అన్ని టీమ్ లను టీవీకే ఓడిస్తది.. తమిళనాడులో విజిల్ మోగాల్సిందే: విజయ్

Caption of Image.
  •  
  •  నాతో ప్రజలకు ఉన్న సంబంధాన్ని ఎవరూ విడగొట్టలేరు టీవీకే పార్టీ చీఫ్ విజయ్

చెన్నై: తమిళనాడులో ఈసారి జరిగే ఎన్నికలు ఇతరులకు సాధారణమేనని, తనకు, తనను ప్రేమించే ప్రజలకు ఎంతో భావోద్వేగమని టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. రాజకీయాలను క్రికెట్తో పోల్చిన ఆయన ఢిల్లీ టీమ్ తో పాటు ఏ జట్టు తమిళనాడు జట్టు (టీవీకే)ను ఓడించలేవని అన్నారు. 

తంజావూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో విజయ్ మాట్లాడారు. ‘ఇతరులకు ఇది సాధారణ ఎన్నికలా అనిపించవచ్చు, కానీ నాకు, నన్ను ప్రేమించే ప్రజలకు ‘ఓషియానిక్ ఎమోషన్’. ఈ సారి ఎన్నికల్లో ఢిల్లీ టీమ్ (బీజేపీ)తో సహా అన్ని జట్లను టీవీకే ఓడిస్తుంది. ఐపీఎల్లో సీఎస్కే కి, తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీకి జనం విజిల్స్ వేస్తే రాష్ట్రం మారుమోగుతుంది. నాతో ప్రజలకు ఉన్న సంబంధాన్ని ఎవరూ విడగొట్ట లేరు. అధికార డీఎంకే దుష్ట శక్తి. మా ప్రభుత్వం పవర్లోకి వస్తే 2 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తం’ అని విజయ్  హామీ ఇచ్చారు.

©️ VIL Media Pvt Ltd.