Reading Time: 2 minutes

Vijay-Sangeetha: విజయ్ విడాకుల సెటిల్మెంట్.. భార్యకు రూ. 250 కోట్లు ఆఫర్ చేసిన దళపతి!

Caption of Image.

తమళ స్టార్ హీరో , ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. గత 27 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న విజయ్, ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నారు. ఇప్పటికే  వీడాకుల కోసం కోర్టు మెట్టులెక్కింది. ఈ వార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న ఒక రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది. 

విడాకుల సెటిల్మెంట్ రూ. 250 కోట్ల ఆఫర్?

విజయ్,సంగీతల మధ్య తలెత్తిన మనస్పర్థలు కోర్టు మెట్లు ఎక్కడంతో, ఈ వ్యవహారం తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని విజయ్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అందుకే, ఈ సమస్యను కోర్టు బయటే (Out of Court Settlement) సామరస్యంగా పరిష్కరించుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన భార్య సంగీత, పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషాల భవిష్యత్తు కోసం విజయ్ సుమారు రూ. 250 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సంగీత తన పిటిషన్‌లో విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఒక నటితో సంబంధం పెట్టుకోవడంతో పాటు , మానసిక వేదనకు గురిచేస్తున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలు బహిర్గతమైతే తన ఇమేజ్ దెబ్బతింటుందని విజయ్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంగీతతో విడాకుల వివాదాన్ని కోర్టు బయటే చక్కదిద్దుకునే పనిలో విజయ్ ఉన్నట్లు సమాచారం.

ఎన్నికల వ్యూహంలో బిజీ..

మరోవైపు, విజయ్ తన సినిమా కెరీర్‌కు స్వస్తి పలికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన ‘టీవీకే’ పార్టీని బలోపేతం చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలోని వివాదాలు ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారకూడదనే ఉద్దేశంతోనే విజయ్ ఈ సెటిల్మెంట్‌కు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

‘జన నాయకుడు’ విడుదల ఎప్పుడు?

విజయ్ తన కెరీర్‌లో ఆఖరి చిత్రంగా ప్రకటించిన ‘జన నాయకుడు’ (Jana Nayagan) విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సెన్సార్ బోర్డుతో ఉన్న సమస్యలు, రాజకీయ సమీకరణాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమవుతోంది. పొంగల్ రేసులో ఉంటుందని భావించినా, అది కుదరలేదు. కోర్టు, సెన్సార్ సమస్యలు ముగిస్తే ఈ సినిమా ఈ సమ్మర్ లోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. విజయ్ తన వైవాహిక బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారా లేదా ఈ భారీ సెటిల్మెంట్‌తో విడిపోతారా అనేది వేచి చూడాలి.  ప్రస్తుతం ఆయన దృష్టి అంతా తన పార్టీని గెలిపించి తమిళనాడు రాజకీయాల్లో ‘జన నాయకుడు’ అనిపించుకోవడంపైనే ఉంది.

 

©️ VIL Media Pvt Ltd.