Reading Time: < 1 minute

Abhishek Sharma: దయచేసి అభిషేక్ శర్మను తప్పించండి.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Caption of Image.

Abhishek Sharma: భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొంతకాలంగా ఫామ్ లేమితో విమర్శల పాలవుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అతడి వైఫల్యాలే ఇందుకు ప్రధాన కారణం. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్–1 టీ20 బ్యాటర్ గా కొనసాగుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్.. కెరీర్లో తొలిసారి వరల్డ్ కప్ ని ఆడుతున్నాడు. సొంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి అతడు.. ఆడిన తొలి మూడు మ్యాచ్ లో డకౌట్ కావడం తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు మ్యాచ్ లని కలిపి అతడు కేవలం 80 పరుగులుమ మాత్రమే చేసిండు. 

రేపు (మార్చ్ 5న) ఇంగ్లాండ్ తో జరిగే సెమీ ఫైనల్ కి ముందు భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, అభిషేక్ శర్మను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరుస వైఫల్యాలతో అతడు తీవ్ర మానసిక వేదనకు కుంగిపోయి ఉండవచ్చని పేర్కొన్నాడు. అలాంటపుడు తుది జట్టు నుంచి అభిని తప్పించడమే సరైన నిర్ణయం అని చెప్పుకొచ్చాడు.  కేవలం నెట్ ప్రాక్టీస్ లో బ్యాటింగ్ తీరును చూసి అంచనాకు రావొద్దని సూచనలు చేశాడు. అతడితో స్పెషల్ గా మాట్లాడాలి.. మానసికంగా అతడు ఎంత దృఢంగా ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయాలని వెల్లడించాడు. 

ఒకవేళ తుది జట్టులో అభిషేక్ శర్మను కొనసాగించొద్దు అనుకుంటే.. ఇషాన్ కిషన్ ని ఓపెనర్ గా ఆడించాలని రవిశాస్త్రి తెలిపారు. లోయర్ ఆర్డర్ లో రింకూ సింగ్ ని తీసుకు వస్తే చాలు టీమ్ సెట్ అవుతుందని అన్నారు. అభిషేక్ శర్మ గత సిరీస్ లో ఇంగ్లాండ్ మీద అదరగొట్టిన తీరును మర్చిపోవద్దు.. వాంఖడేలో గతంలో అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంది. అక్కడ అతడు వేగంగా సెంచరీలు చేశాడు. కాబట్టి అభిషేక్ శర్మను కొనసాగిస్తే బాగుంటుంది.. ఒకవేళ రింకూను తీసుకురావాలని అనుకుంటే మాత్రం ఓపెనింగ్ జోడీని మార్చాల్సి వస్తుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

©️ VIL Media Pvt Ltd.