Reading Time: < 1 minute
Ustaad Bhagat Singh Likely To Release On March 19 After Toxic Postponement

 కన్నడ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ ఈ నెల 19న రిలీజ్  కావాల్సిఉంది. కానీ గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో టాక్సిక్ రిలీజ్ వాయిదా వేశారు. దాంతో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్  విడుదలపై కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని డిస్ట్రిబ్యూటర్లకు మార్చి 19, గురువారం విడుదలకు సిద్ధంగా ఉండాలని మేకర్స్ సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్.. ఊహించని ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాడుగా

‘టాక్సిక్’ రిలీజ్ పోస్ట్‌పోన్ కావడంతో ఖాళీ అయిన స్లాట్‌ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వినియోగించుకునే అవకాశంగా భావిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి ఇది సరైన సమయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ఊపందుకోగా, రిలీజ్ తేదీపై మార్చి 19న రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల బుకింగ్స్, షెడ్యూల్స్ విషయంలో ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు అనుకున్న డేట్ కంటే ముందే వస్తుండడంతో ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ త్వరగా ఫినిష్ చేసేందుకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ రంగంలోకి దిగుతున్నాడు. చక చక ఆర్ ఆర్ ఫినిష్ చేసే ఫైనల్ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు తమన్ ఎంట్రీ ఇస్తున్నాడు. OG తో అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చిన తమన్ ఇప్పడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు ఏ రేంజ్ లో ఇస్తాడో చూడాలో. మొత్తానికి టాక్సిక్ రిలీజ్ వాయిదా ఉస్తాద్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.