
ప్రపంచ దేశాలన్నీ అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధ పరిణామాలనే గమనిస్తున్నాయి. ఈ యుద్ధం ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో కనిపిస్తుంది. అయితే.. మార్చి 3న చంద్ర గ్రహణం కావడంతో.. ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
All three world leaders in the current war were born the day of an eclipse:
🪐 Trump: Jun 14, 1946: Lunar Eclipse
🪐 Netanyahu: Oct 21, 1949 Solar Eclipse
🪐 Khamenei: Apr 19, 1939: Solar EclipseThe next eclipse happens tonight, in the wake of Khamenei’s death.
— Chris Brennan (@chrisbrennan7) March 2, 2026
అది మరేంటో కాదు.. ఈ యుద్ధానికి కారకులైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ.. ఈ ముగ్గూరు గ్రహణ కాలంలో జన్మించారని క్రిస్ బ్రెన్నాన్ అనే ప్రముఖ జ్యోతిష్కుడు చెప్పుకొచ్చారు. అవునో.. కాదో.. అని నెటిజన్లు ఇంటర్నెట్లో చెక్ చేయగా.. ట్రంప్, నెతన్యాహు, అలీ ఖమేనీ పుట్టిన రోజుల్లో గ్రహణం ఏర్పడిందని వెల్లడైంది.
* జూన్ 14, 1946న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మించారు. ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం.
* అక్టోబర్ 21, 1949న నెతన్యాహు పుట్టారు. అదే రోజు పాక్షిక సూర్యగ్రహణం సంభవించింది.
* ఏప్రిల్ 19, 1939న ఖమేనీ జన్మించారు. ఇదే రోజు.. సూర్యగ్రహణం కంకణాకారంలో సంభవించించింది.
ఇలా గ్రహణ కాలంలో పుట్టిన ఈ ముగ్గురూ యుద్ధంతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం భయానక స్థాయికి చేరడానికి ఈ ముగ్గురే ప్రధాన కారణం. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మరోవైపు ఇరాన్, హెజ్బొల్లా ప్రతీకార దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది.
ఇరాన్తో పాటు లెబనాన్, ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉన్న ప్రాంతాలు మంటల్లో తగలబడుతున్నాయి. వరుసగా నాలుగో రోజు మంగళవారం కూడా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించాయి. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైకి ఇరాన్ కూడా మిసైల్, డ్రోన్ దాడులు కొనసాగించింది.