Reading Time: < 1 minute
Trump Clarifies On International Narratives On Iran War

గత నెల 28న అకస్మాత్తుగా ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, అధికార పెద్దలను అంతమొందించింది. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగాయి. అయితే తాజాగా అంతర్జాతీయ మీడియాలో కొత్త కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్‌పై యుద్ధానికి అమెరికాకు అంత తొందరలేకపోయినా.. ఇజ్రాయెలే ఉసికొల్పిందని.. దీంతో అమెరికా కూడా రంగంలోకి దిగాల్సి వచ్చిందని కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం ట్రంప్ ప్రభుత్వం పని చేస్తోందని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Gold Rates: యుద్ధ సమయంలో మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనను ఒప్పించారనే వాదనను ట్రంప్ తోసిపుచ్చారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే యుద్ధంలోకి దిగినట్లుగా వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని ఖండించారు. ఇజ్రాయెల్ కాదు.. తామే ఇరాన్‌పై యుద్ధాన్ని నిర్ణయించినట్లుగా చెప్పుకొచ్చారు. టెహ్రాన్‌పై దాడి చేసింది తామేనని పేర్కొన్నారు. ఇరాన్ తమపై భారీ దాడులకు కుట్ర పన్నడంతో ముందుగా అమెరికానే దాడి చేసిందని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.

అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రతీకారం తీర్చుకునేలా ఇజ్రాయెల్ కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా వాషింగ్టన్ ఊహించిందని ఇటీవల అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. దీంతో ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి దిగిందని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నారు. తాజాగా ఆ కథనాలను ట్రంప్ ఖండించారు. మార్కో రూబియోకు వ్యతిరేకంగా ట్రంప్ మాట్లాడారు. తామే ఇరాన్‌పైకి యుద్ధానికి దిగినట్లుగా చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: US-Iran: దుబాయ్‌పై ఇరాన్ మళ్లీ దాడులు.. అమెరికా ఎంబసీలో భారీగా మంటలు