Reading Time: < 1 minute
Balakrishna Manchu Manoj Reunite For Nbk111 Gopichand Malineni Movie

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం (NBK111) రేపు (మార్చి 5) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఒక కీలక పాత్ర కోసం వెర్సటైల్ నటుడు మంచు మనోజ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో బాలయ్యతో కలిసి ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాలో నటించిన మనోజ్, దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ నటసింహంతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. ఈ సినిమాలో మనోజ్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని, బాలయ్యతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ ప్రాజెక్టుకు ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

Also Read : Toxic Movie టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. బెంగళూరులో భారీ ఈవెంట్‌కు యష్ ప్లాన్!

వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను రేపటి నుంచే ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. బాలయ్యను మరోసారి ఊరమాస్ లుక్‌లో చూపించబోతున్న గోపీచంద్ మలినేని, ఈ సినిమాను రాబోయే దసరా కానుకగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనోజ్ ఎంట్రీతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపయ్యాయి, ఒకవేళ ఇది అఫీషియల్‌గా ఖరారైతే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ గ్యారెంటీ!