Reading Time: < 1 minute

వాగన్ ఆర్ రికార్డ్ ..అత్యధిక సేల్స్ లో మొదటి స్థానం

Caption of Image.
  • ఫిబ్రవరిలో దేశీయ ఆటో మార్కెట్ బలమైన వృద్ధి
  • ఎసయూవీలకు పెరిగిన డిమాండ్
  •  మైలేజ్, భద్రతకే కొనుగోలుదారుల ప్రాధాన్యం
  • టాప్ 10లో మారుతి సుజుకి మోడళ్ల ఆధిపత్యం

ముంబై: మధ్యతరగతి కారు టాప్ లో నిలిచింది. ఫిబ్రవరి 2026 గణాంకాల ప్రకారం మారుతి సుజుకీ కంపెనీకి చెందిన వాగన్ ఆర్ టాప్ లో ఉంది. ఇదిలా ఉండగా వినియోగదారులు ఎక్కువగా ఎస్ యూవీ విభాగం వైపు మొగ్గు చూపినట్టు అమ్మకాల గణాంకాలు చెబుతున్నాయి. జాబితాలో మారుతి సుజుకి మోడళ్లే అగ్రస్థానాల్లో నిలిచాయి. 

►ALSO READ | 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు అవుతుందా.. మార్కెట్ వర్గాలు ఏం చెబుతున్నాయి..?

ఇందులో వాగన్ ఆర్ అత్యధికంగా అమ్ముడైన కారుగా మొదటి స్థానాన్ని దక్కించు కుంది. సరసమైన ధర, మంచి మైలేజ్ మధ్య తరగతి కుటుంబాలను ఈ కార్ వైపు ఆకర్షిం చింది. అలాగే స్విఫ్ట్, డిజైర్ అమ్మకాలలో జోరు కొనసాగిస్తూ టాప్ 5 లో చోటు సంపాదించా యి. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బ్రెజ్జా కు మంచి డిమాండ్ కనిపించింది. కుటుంబ అవసరాలకు సరిపోయే ఎర్టిగా కూడా మంచి స్పందన పొందింది. వీటితో పాటు ఫ్రాంక్స్ టాప్ 10 జాబితాలో స్థానం సాధించింది.
 

©️ VIL Media Pvt Ltd.