Reading Time: < 1 minute
Donald Trump Iran Leadership Wiped Out Khamenei Death Updates

Iran Israel War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వారు(ఇరాన్) మాట్లాడాలనుకుంటున్నారు. నేను ఆలస్యమైందని చెప్పాను. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది’’ అని అన్నారు. ఆదివారం ఇరాన్ నాయకుల అభ్యర్థన మేరకు వారితో మాట్లాడటానికి అంగీకరించానని ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత, దీనికి విరుద్ధంగా తాజా ప్రకటన వచ్చింది. ఇరాన్ మిస్సైల్ ప్రొగ్రాం, అణు చర్చలపై ట్రంప్ ఆలస్యమైందని చెప్పారు.

Read Also: Jobs Growth: ఏఐ, ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన నియామకాలు..

శనివారం ఉదయం నుంచి ఇజ్రాయిల్, అమెరికాలు ఇరాన్‌పై బాంబులు,మిస్సైల్స్ వర్షం కురిపిస్తున్నాయి. టెహ్రాన్‌పై జరిగిన భీకర దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. కీలకమైన అధికారులు, కమాండర్లు అంతా తుడిచిపెట్టుకుపోయినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. నటాంజ్, ఇస్పహాన్‌లోని అణు కేంద్రాలపై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. మరోవైపు, ఇరాన్ కూడా ప్రతీకారంతో రగిలిపోతోంది. గల్ఫ్‌లో అమెరికా మిత్రదేశాలైన ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. చమురు క్షేత్రాలు, విలాసవంతమైన రెస్టారెంట్లను టార్గెట్ చేస్తోంది.