Reading Time: 2 minutes

శక్తి వంతమైన చంద్ర గ్రహణ ప్రారంభం: 4.34 నుంచి 5.33 గంటల మధ్య చాలా పవర్ ఫుల్

Caption of Image.

చంద్ర గ్రహణం ప్రారంభం అయ్యింది. అత్యంత శక్తి వంతమైన చంద్రగ్రహణ సమయం ఆరంభం అయ్యింది. 2026, మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకు ప్రారంభం అయ్యింది. 

ప్రారంభం అయిన చంద్ర గ్రహణం.. సాయంత్రం 6 గంటల 48 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈ చంద్ర గ్రహణంలో కీలకమైన సమయం.. రక్త చంద్రుడు కనిపించే సమయం మాత్రం సాయంత్రం 4 గంటల 34 నిమిషాల నుంచి 5 గంటల 33 నిమిషాల వరకు. 

గ్రహణం టైమింగ్స్ :

  • గ్రహణ ప్రారంభం : మధ్యాహ్నం 3:21 గంటలు
  • గ్రహణ మధ్యకాలం: సాయంత్రం 5:03 గంటలు
  • సంపూర్ణ మధ్యకాలం: సాయంత్రం 5:32 గంటలు
  • గ్రహణ మోక్ష (విడుపు)కాలం: సాయంత్రం 6:48 గంటలు
  • గ్రహణం మొత్తం వ్యవధి: 3 గంటల 27 నిమిషాలు
  • భారతదేశంలో  కనపడే సమయం: సాయంత్రం 6:20 గంటల నుంచి సుమారు 27 నిమిషాలు

►ALSO READ | చంద్రగ్రహణం 2026..  గ్రహణం.. పట్టు స్నానం ఎప్పుడు.. విడుపుస్నానం ఎప్పుడు.. ఏటైంలో  గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది..

పగటి పూట చంద్ర గ్రహణం రావటంతో మధ్యాహ్న సమయంలో చంద్రుడు ఆకాశంలో కనిపించే అవకాశం లేదు. సూర్యాస్తమయం తర్వాత.. చంద్ర గ్రహణం ముగింపు సమయంలో ఇండియాలో కనిపించే అవకాశం ఉంది.

►ALSO READ | గ్రహణం ఎఫెక్ట్.. నిల్వ ఆహార పదార్దాలపై దర్భ(గరిక)ను వేయండి..గ్రహణ ప్రభావం ఉండదు..ఇంట్లో ఎక్కడెక్కడ..ఏ సమయంలో వేయాలి..! 

మన దేశంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, షిల్లాంగ్, కోహిమా, ఇటానగర్‌  ప్రాంతాల్లో చంద్ర గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. అక్కడ ఆకాశంలో వాతావరణ పరిస్థితుల ఆధారంగా.. చంద్ర గ్రహణాన్ని చూడొచ్చు. 

►ALSO READ | ఆధ్యాత్మికం..  చంద్రగ్రహణం(మార్చి3)..  గర్భిణీలు.. వృద్దుల.. చిన్న పిల్లలు పాటించాల్సిన నియమాలు ఇవే.. ఎప్పటి వరకు అన్నం తినొచ్చు..! 

ఈ అద్భుత దృశ్యాన్ని సాధారణ కళ్లతో చూడటమే కాకుండా.. డీఎస్ఎల్ఆర్ కెమెరాల ద్వారా చూడొచ్చు. చంద్ర గ్రహణాన్ని నేరుగా చూడొద్దు అంటున్నారు నిపుణులు. గ్రహణం కళ్లద్దాలు పెట్టుకుని చూడాలని సూచిస్తున్నారు. బైనాక్యులర్లు.. చిన్న టెలిస్కోపు ద్వారా చూస్తే.. బ్లడ్ మూన్ బాగా కనిపిస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఇండియాలో వివిధ నగరాల్లో చంద్రగ్రహణం కనిపించనున్న సమయం:

  • హైదరాబాద్ – సాయంత్రం 6:26
  • చెన్నై – సాయంత్రం 6:21
  • బెంగళూరు – సాయంత్రం 6:32
  • ఢిల్లీ – సాయంత్రం 6:22
  • నోయిడా – సాయంత్రం 6:20
  • గురుగ్రామ్ – సాయంత్రం 6:02
  • లక్నో – సాయంత్రం 6:02
  • కోల్‌కతా – సాయంత్రం 5:43
  • భోపాల్ – సాయంత్రం 6:21
  • పాట్నా – సాయంత్రం 5:55
  • కాన్పూర్ – సాయంత్రం 6:14
  • వారణాసి – సాయంత్రం 5:43
  • ప్రయాగ్‌రాజ్ – సాయంత్రం 5:55
  • ఇండోర్ – సాయంత్రం 6:26
  • డెహ్రాడూన్ – సాయంత్రం 6:14
  • మధుర – సాయంత్రం 6:25
  • చండీగఢ్ – సాయంత్రం 6:27
  • జైపూర్ – సాయంత్రం 6:14

 

©️ VIL Media Pvt Ltd.