Reading Time: < 1 minute
Cm Revanth Reddy Holds Key Review Meeting With District Collectors On Governance And Development

CM Revanth Reddy: అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనకు దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు కానుంది. ఈ సమావేశం రెండు భాగాలుగా జరుగనుంది. ఉదయం సెషన్‌ లో జనగణనపై సమగ్ర సమీక్ష నిర్వహించనుండగా.. మధ్యాహ్నం సెషన్‌లో “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” అంశంపై విస్తృత చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల ప్రగతి, జిల్లా స్థాయి సమస్యల పరిష్కారం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.

Iran–Israel War Impact: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. ఆ మ్యాచులు అన్ని రద్దు..!

ఈ సమావేశం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో సుదీర్ఘంగా కొనసాగనుంది. ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యాచరణకు ప్లానింగ్ చేయనున్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు, శాఖాధిపతులు పాల్గొననున్నారు. మంత్రులు, డీజీపీ, ముఖ్య కార్యదర్శులు కూడా హాజరుకానున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలకు సేవలు వేగంగా అందించడం వంటి అంశాలపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు సమాచారం.

NANI : చిన్న పిల్లలే కాదు.. లేడీ ఫ్యాన్స్‌కు దూరం అయిన నేచురల్ స్టార్