Reading Time: < 1 minute
Etv Win New Ui Update 2026 Content Lineup

ఈటీవి విన్ భారతదేశంలో రీజినల్ కంటెంట్‌కు ఏకైక OTT ప్లాట్‌ఫారమ్‌గా తన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. వరుస ఒరిజినల్ బ్లాక్‌బస్టర్లతో కేవలం మూడు ఏళ్లలోనే తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది. మూలాలకు దగ్గరగా ఉన్న కథలను ప్రేక్షకులకు అందిస్తూ, దేశవ్యాప్తంగా, విదేశాల్లో విశ్వసనీయమైన సబ్‌స్క్రైబర్ బేస్‌ను నిర్మించుకుంది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, అనగనగా, కానిస్టేబుల్ కనకం, AIR వంటి వరుస విజయవంతమైన ఒరిజినల్స్ అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విజయ పరంపర ETV Winను రీజినల్ OTT రంగంలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిపింది. ఈ వేగాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు ETV Win మరొక దశలోకి అడుగుపెడుతోంది. పూర్తిగా రీడిజైన్ చేసిన యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత స్లీక్, ఇన్‌ట్యూయిటివ్, ఇమర్సివ్ అనుభవాన్ని అందిస్తోంది. అన్ని డివైసెస్‌లో సులభమైన నావిగేషన్, మెరుగైన కంటెంట్ డిస్కవరీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

Also Read : Big Breaking : బుర్జ్‌ ఖలీఫాను ఖాళీ చేయిస్తున్న అధికారులు

మల్టీ లాంగ్వేజ్ సదుపాయాలను విస్తరించి తెలుగు కథలను భాషా సరిహద్దులను దాటి జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీలతో, అత్యుత్తమ HDR విజువల్స్, స్పేషియల్ ఆడియోతో థియేటర్‌లాంటి అనుభూతిని ఇంట్లోనే అందిస్తోంది. 2026–2027 కోసం ETV Win 16 థియేట్రికల్ రిలీజులు, రెండు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో భారీ కంటెంట్ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది. ఈ లైనప్‌లో ప్రముఖ నటీనటులు రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ పాకశాల పంతం, ఆది సాయి కుమార్ సబ్ ఇన్ స్పెక్టర్ యుగంధర్, సుమంత్ న్యూటన్ థర్డ్ లా, తిరువీర్‌ పాపం ప్రతాప్, జెడి చక్రవర్తి #DM, వర్ష బొల్లమ్మ కానిస్టేబుల్ కనకం చిత్రాలు ముందుగా థియేటర్స్ లో అలరించబోతున్నాయి. బ్లాక్ బస్టర్ నిర్మాత రాజేష్ దండా తొలిసారి ETV Win తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నం. 9 ని అనౌన్స్ చేయడం మరో విశేషం.
వీటితో పాటు లిటిల్ థింగ్స్, జిఎస్కే, గుర్తుకొస్తున్నాయి, జిల్లేడు చెట్టు, మండువలోగిలి చిత్రాలు థియేటర్స్ లో అలరించబోతున్నాయి.