
స్టార్ కోదండరామిరెడ్డి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు వైభవ్. తన తండ్రి దర్శకత్వంలోనే తెరకెక్కిన గొడవ అనే సినిమాతో పరిశ్రమకు పరిచయమయ్యాడు. 2007లో రిలీజైన ఈ సినిమా హీరోగా వైభవ్ కు మంచి గుర్తింపే తీసుకొచ్చింది. ఆ తర్వాత సరోజ, కాస్కో, గోవా, గ్లాంబ్లర్, యాక్షన్ త్రీడీ, బిర్యానీ, అనామిక, కట్టేరి, మన్మథ లీల, కస్టడీ.. ఇలా చాలా సినిమాల్లో హీరోగా, సెకెండ్ హీరోగా, సహాయక నటుడిగా మెప్పించాడు వైభవ్. అయితే ట్యాలెంట్ ఉన్న స్టార్ హీరోగా ఎదగలేకపోయాడీ యాక్టర్ .దీంతో ఇప్పుడు ఎక్కువగా సహాయక నటుడి పాత్రలే పోషిస్తున్నాడు వైభవ్. అయితే సినిమాల పరంగా తప్పితే ఇతని వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. వైభవ్ సోదరుడు కూడా ఫేమస్ యాక్టర్. ఎక్కువగా తమిళ సినిమాల్లో కనిపించే ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కిష్కింధపురిలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. మరి ఇంతకీ ఆయనెవరనుకుంటున్నారా?
శివ కార్తికేయన్ హీరోగా నటించిన వరుణ్ డాక్టర్ సినిమా చూశారా? అందులో మహాలి అనే పాత్రలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు సునీల్ రెడ్డి. అలాగే రజనీకాంత్ జైలర్ సినిమాలోనూ తమన్నా లవర్ గా కనిపించాడు. 2018లో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘సీతాకత్తి’ సినిమాలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు సునీత్. ఆ తర్వాత వరుణ్ డాక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్’లో కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ పాత్రలో సునీల్ నటించాడు. ‘అన్నాబెల్లే సేతుపతి’, ‘బీస్ట్’, ‘సొప్పన సుందరి’ సినిమాల్లోనూ ఈ నటుడు పోషించిన పాత్రలు బాగా హైలెట్ అయ్యాయి. ఇక ‘మామన్నన్ (తెలుగులో నాయకుడు)’, ‘జైలర్’ సినిమాలు సునీల్ కు మరింత గుర్తింపు తెచ్చిపెట్టాయి.
View this post on Instagram
A post shared by Storyboard Pictures | Wedding Photography Company (@storyboard_pictures)
ఇక గతేడాది వచ్చిన పెరుసు సినిమాలో సునీల్ పాత్రను చూసి నవ్వుకోని వారుండరంటే అతి శయోక్తి కాదు. అలాగే ఇతను నటించిన చెన్నై సిటీ గ్యాంగ్ స్టర్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఎక్కువగా తమిళ డబ్బింగ్ సినిమాల్లోనే కనిపించిన సునీల్ గతేడాది సూపర్ హిట్ తెలుగు సినిమా కిష్కింధపురిలో ఓ కీలక పాత్రతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు.
డాక్టర్ సినిమాలో సునీల్ రెడ్డి..
Thank you for love & support
#Doctor pic.twitter.com/Qp5WAFvv3u
— Sunil Reddy (@SunilReddy22) October 10, 2021
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
