Reading Time: < 1 minute
Agniveer Vayu Rally 2026: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఇంటర్‌ అర్హతతో IAF ఉద్యోగాలకు ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ! ఎప్పుడంటే..

అమరావతి, ఫిబ్రవరి 26: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మహిళ, పురుష అభ్యర్థులకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ మార్చి 9 నుంచి ప్రారంభించనున్నట్లు గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ ఓ ప్రకటనలో తెలి­పారు. గుంటూరు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో ఇటీవల ఆ­య­న మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.

మార్చి 9, 10 తేదీలలో ఏపీ, తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్ధులకు, మార్చి 12, 13 తేదీలలో ఏపీ పురుష అభ్యర్థులకు, మార్చి 15, 16 తేదీలలో తెలంగాణ పురుష అభ్యర్థులకు ఓపెన్‌ ర్యాలీ జరగనున్నట్లు హైదరాబాద్‌ ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూటింగ్‌ డైరెక్టర్‌ వింగ్‌ కమాండర్‌ షేక్‌ యాకూబ్‌ అలీ తెలిపారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ ర్యాలీలో పాల్గొనే అభ్యర్ధులు తప్పనిసరిగా 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించి ఉండాలన్నారు. ఇంటర్మీడియట్‌ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులని అన్నారు.

ఏపీలో పశు వైద్యుల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌.. మంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశువైద్యుల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆర్థికశాఖ అనుమతి కోసం ప్రతిపాదన పంపినట్లు వెల్లడించారు. మరోవైపు పశువైద్య భవనాల మరమ్మతుకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.25 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ మేరకు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పశు వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కె మురళీమోహన్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.