Reading Time: < 1 minute
Vishwambhara: త్వరలో విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ మూవీ విశ్వంభర విడుదల తేదీకి సంబంధించి త్వరలో స్పష్టత రానుంది. దర్శకుడు వసిష్ఠ రూపొందిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. గత ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా, గ్రాఫిక్స్ పనుల జాప్యం కారణంగా వాయిదా పడింది. జగదేక వీరుడు అతిలోకసుందరి, అంజీ వంటి సినిమాల తర్వాత చిరంజీవి చేస్తున్న ఫాంటసీ చిత్రం కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా సినిమాను తీర్చిదిద్దేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దర్శకుడు వసిష్ఠ బింబిసారతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్‌తో అదే జానర్‌లో మరో విజయవంతమైన చిత్రాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

PM Modi: విజయ్‌ దేవరకొండ తల్లిదండ్రులకు ప్రధాని మోదీ లేఖ