
రాయదుర్గం: ప్రేమ విఫలం కావడంతో యూట్యూబర్ కోమలి(21) ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వైజాగ్‌కు చెందిన కోమలి రంగారెడ్డి జిల్లా మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తోంది. బిఎస్‌సి చదువుతూనే యూట్యూబర్‌గా వీడియోలు చేస్తున్నారు. వైజాగ్‌కు చెందిన మరో యూట్యూబర్ నిఖిల్ రెడ్డి పరిచయం కావడంతో అతడితో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో కోమలికి నిఖిల్ దూరంగా ఉండడంతో ఆమె ఆరు నెలల క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బంధువుల సర్ధి చెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఇటీవల మళ్లీ పెళ్లి విషయంలో నిఖిల్ రెడ్డితో కోమలి గొడవ పెట్టుకుంది. దీంతో మనస్థాపంతో కోమలి ఇంట్లో చీరతో ఉరేసుకొని చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.