
హలిస్కా: మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మెంచో హతమయ్యాడు. సైన్యం జరిపిన ప్రత్యేక ఆపరేషన్ లో ఎల్ మెంచోను మట్టుబెట్టాయి. ప్రియురాలిని కలుస్తుండగా
ఎల్ మెంచోను సైనక బలగాలు చుట్టుముట్టి చంపేశాయి. మెక్సికోలోని హలిస్కోలోని మెంచో సంచరిస్తున్నారని అమెరికా ఇంటెలిజెన్స్ తెలిపింది. దీంతో అతడి ప్రయురాలి నమ్మకస్తుడైన అనుచరుడిపై నిఘా పెట్టారు. తపాల్పా నగరంలో ప్రియురాలిని మెంచో కలువగానే భద్రతా బలగాలు ఆ నగరాన్ని చుట్టుముట్టాయి. ఆకాశంలో ఎయిర్ ప్లేన్ లో నిఘా పెట్టాయి. పోలీసులు కాల్పులు జరపడంతో మెంచో అనచురులు ఎదురు కాల్పులో జరిపారు. మెంచో ఇద్దరు బాడీగార్డులతో కలిసి అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడు. వెంటనే భద్రతా బలగాలు అండర్ గ్రౌండ్ చుట్టుముట్టి కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో అతడు చనిపోయాడు. ఎల్ మెంచో అసలు పేరు నెమెసియో ఓసెగువెరా సెర్వంటెస్, న్యూ జనరేషన్ కార్టెల్ అనే క్రిమినల్ సంస్థకు అతడు బాస్ గా ఉన్నాడు. గతంలో ఆయన పోలీస్ గా విధులు నిర్వహించాడు. 2015లో 20 మందికి పైగా పోలీసుల తలలు నరికి చంపేశాడు. అతడు కనిపించకుండా ఉంటూ నేర సామ్రాజ్యాన్ని స్థాపించడంతో అమెరికాతో పాటు మెక్సికో దేశాన్ని గడగడలాడిస్తున్నాడు. మెంచో తలపై అమెరికార 136 కోట్ల రివార్డును కూడా ప్రకటించింది.