Reading Time: < 1 minute

మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున పారిశుద్ధ్య సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న మార్నింగ్ వాక్ లో క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెయిన్ రోడ్డు పై, ఇండ్లలో ఉన్న చెత్త చెదారాలను ఏ రోజుకు ఆ రోజు తరలించి ప్రజల ఆరోగ్యాలను సంరక్షించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించి పారిశుద్ధ్య నివారణకు పాటుపడాలన్నారు. కార్మికులు నిత్యం ప్రధాన రోడ్లను శుభ్రపరచాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.