Reading Time: < 1 minute
Hindus Killed In Bangladesh Third Murder Reported Amid Rising Communal Violence

Banglasesh: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ యువకుడిని అక్కడి మతన్మాదులు హత్య చేశారు. దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యల తర్వాత ఇది మూడో ఘటన. మైమన్‌సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్‌ను 22 ఏళ్ల నోమన్ మియాన్ అనే వ్యక్తి కాల్చి చంపినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, భజేంద్ర గ్రామాన్ని రక్షించే పారామిలిటీ గ్రూపులో భాగంగా ఉన్నాడు. వస్త్రకర్మాగారంలో హింసాత్మక సంఘటన పజరిగిన సమయంలో మియాన్ భజేంద్రను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దాడిలో భజేంద్ర అక్కడికక్కడే మరణించాడు.

Read Also: Walking for Weight Loss: శరీరంలో కొవ్వు పేరుకుపోతుందా.. ఇలా చేస్తే వెంటనే కరిగిపోతుంది..

అంతకుముందు, బంగ్లాదేశ్‌ రాడికల్ ఇస్లామిస్ట్ నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత, ఆ దేశంలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మైమన్‌సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే దీపు చంద్ర దాస్ అనే హిందూ వ్యక్తిని ‘‘దైవదూషణ’’ ఆరోపనలతో అక్కడి మతోన్మాద మూక దారుణంగా హత్య చేసి, నగ్నంగా శరీరాన్ని రోడ్డు పక్కన చెట్టుకు కట్టేసి కాల్చేశారు. దీని తర్వాత, రాజ్‌బరి జిల్లాలో అమృత్ మండల్ అనే వ్యక్తిపై మూక దాడి జరిగింది. గ్రామస్తులంతా కలిసి అమృత్‌ను కొట్టి చంపారు.