Reading Time: < 1 minute

SIR నోటీసుల టెన్షన్ వద్దు.. ఓటర్ల ఇళ్లకే BLOలు.. ఈసీ కీలక ప్రకటన

Caption of Image.
  • విచారణ కోసం BLOలను కలవాల్సిన అవసరం లేదు: CEC
  • BLOలే ఓటర్ల ఇళ్లకు వస్తారని CEC ప్రకటన 
  • BLOలే డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేస్తారు: CEC
  • సర్ ప్రక్రియ ఆరోపణలపై CEC కీలక భేటీ

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) నోటీసులపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం తప్పనిసరిగా బూత్ లెవల్ ఆఫీసర్లను (BLO) కలవాల్సిన అవసరం లేదని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. BLOలే సంబంధిత ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లను పరిశీలించి వారే అప్‌లోడ్ చేస్తారని ఈసీ పేర్కొంది.

SIR ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆరోపణలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా నోటీసుల విచారణ, డాక్యుమెంట్ల పరిశీలన ప్రక్రియను సులభతరం చేయడంపై ఈ భేటీలో చర్చించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నోటీసుల పంపిణీ, విచారణ దశ కొనసాగుతోంది. తెలంగాణలోనూ BLOలు ఓటర్లకు నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.

ఇదిలా ఉండగా..SIR నిర్ణయాలపై ఈసీలో అంతర్గతంగా విభేదాలు వచ్చాయన్న వార్తలు, ప్రతిపక్షాల ఆరోపణలతో వివాదం చెలరేగింది. అయితే ఎన్నికల సంఘం మాత్రం SIRకు సంబంధించిన తుది నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఆమోదంతోనే జరిగాయని స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.