
‘పిజ్జా’, ‘పేట’, ‘జిగర్తాండ’ వంటి వైవిధ్యమైన సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు. లేటెస్ట్ గా ఈ డైరెక్టెర్ తెరకెక్కించిన 10వ చిత్రం ‘డోరోతి’. రిషికాంత్, సనత్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పీరియాడిక్ డ్రామా శుక్రవారం (సెప్టెంబరు 25) తమిళంలో థియేటర్లలో విడుదలైంది. అయితే రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే కోలీవుడ్‌లో పెను తుఫానును సృష్టించి.. ఊహించని వివాదంలో చిక్కుకుంది.
బోల్డ్ సీన్స్ తో షాక్..
ప్రమోషన్స్‌లో అసలు కథాంశాన్ని దాచిపెట్టిన మేకర్స్, థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. 1990ల నాటి గ్రామీణ తమిళనాడు నేపధ్యంలో, కుల వివక్ష, హింస అంశాలతో ప్రారంభమయ్యే ఈ చిత్రం ఇంటర్వెల్ తర్వాత ఊహించని విధంగా ‘LGBTQ+’ కాన్సెప్ట్‌లోకి మారుతుంది. సినిమాలో ఇద్దరు ప్రాణస్నేహితుల మధ్య ప్రేమ పుట్టడం, ఒక మిత్రుడి కోసం మరొకరు లింగమార్పిడి (Sex Reassignment) చేసుకోవడం, క్లైమాక్స్‌లో వచ్చే బోల్డ్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. క్లైమాక్స్‌లో వచ్చే లిప్‌లాక్ సీన్లు చూసి ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు
ఇద్దరు ప్రాణస్నేహితుల మధ్య ప్రేమ పుట్టడం ( రిషికాంత్, సనత్) , ఒక మిత్రుడి కోసం మరొకరు లింగమార్పిడి (Sex Reassignment) చేసుకోవడం, క్లైమాక్స్‌లో వచ్చే బోల్డ్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి., క్లైమాక్స్‌లో వచ్చే లిప్‌లాక్ సీన్లు చూసి ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు
కీర్తి సురేశ్ పాత్రపై తీవ్ర విమర్శలు..
ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఆమె చేసిన ఒక అభ్యంతరకరమైన సన్నివేశం ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారితీసింది. హోమ్లీ ఇమేజ్ ఉన్న కీర్తి సురేశ్ ఇలాంటి బోల్డ్, వర్ణించలేని సీన్లలో నటించడమేంటని ఆమె అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగమార్పిడి, స్వలింగ సంపర్కం వంటి సున్నితమైన అంశాలను తమిళ సంస్కృతిని కించపరిచేలా తీశారంటూ .. వర్ణించలేని వివాదాస్పద పాత్రలు చేశారా? అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు..
బాయ్‌కాట్ ట్రెండింగ్ ..
ఇళయరాజా తన 1,540వ ప్రాజెక్ట్ కు సంగీతం అందించిన ఈ సినిమా సాంకేతికంగా బాగున్నప్పటికీ, సెకండాఫ్ టోన్ పూర్తిగా మారిపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. కోలీవుడ్ పరువు తీశారు అంటూ ‘X’ (ట్విట్టర్) వేదికగా #BoycottDorothy ట్రెండ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇది కార్తీక్ సుబ్బరాజు చేసిన బోల్డ్, రియలిస్టిక్ అటెంప్ట్ అని సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా, ప్రమోషన్లలో దాచిపెట్టి థియేటర్లలో LGBTQ షాక్ ఇవ్వడం ఇప్పుడు కోలీవుడ్‌లో రచ్చ రచ్చ చేస్తోంది..
Guys, please don’t encourage these type of Movies ❌👎
Let’s Boycott #Dorothy 🙏🫠 pic.twitter.com/AMEeWmDzIP
— Karthik SK🥳💫 (@Karthik_SK45) September 25, 2026