Reading Time: < 1 minute

CBSE కొత్త చైర్మన్‌గా మందీప్ కె. భండారి నియామకం

Caption of Image.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కొత్త చైర్మన్‌గా 2001 బ్యాచ్ ఏజీఎమ్యూటీ క్యాడర్ ఐఏఎస్ అధికారి మందీప్ కె. భండారి నియమితులయ్యారు. క్యాబినెట్ నియామకాల కమిటీ 2026 సెప్టెంబర్ 25న ఈ నియామకాన్ని ఆమోదించింది.  

మందీప్ భండారి  లుధియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడల్ సాధించి ఐఏఎస్‌లో చేరారు. ఆయన లేహ్, జమ్ము డిప్యూటీ కమిషనర్‌గా, జమ్ము డివిజనల్ కమిషనర్‌గా, శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డ్ సీఈఓగా పనిచేశారు. జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య, వైద్య విద్య శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు.

కేంద్రంలో యూనియన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ మంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా, అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డ్ సీఈఓగా ఉన్నారు.

పునఃమూల్యాంకన వివాదం నేపథ్యం

2026లో సీబీఎస్‌ఈ తొలిసారి పూర్తి స్థాయిలో ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) విధానాన్ని 12వ తరగతి  ఆన్సర్ బుక్ ఎవాల్యుషన్ కోసం ప్రవేశపెట్టింది. ఫలితాల తర్వాత విద్యార్థులు స్కాన్ చేసిన పేజీలు అస్పష్టంగా ఉన్నాయని, కొన్ని పేజీలు లేవని, కొందరికి ఇతర విద్యార్థుల ఆన్సర్ షీట్స్ వచ్చాయని ఫిర్యాదులు చేశారు. ఈ వివాదం తో సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది.  

సీబీఎస్‌ఈ మరో విద్యా సంవత్సరం, ఎగ్జామ్ సైకిల్‌కు సిద్ధమవుతున్న సమయంలో కొత్త చైర్మన్‌గా భండారి బాధ్యతలు చేపట్టింది. డిజిటల్ ఎవాల్యువేషన్ అనుభవాల దృష్ట్యా  బోర్డు పరీక్షా వ్యవస్థపై విశ్వాసం కొనసాగించడం ఆయన ముందున్న సవాల్. 

©️ VIL Media Pvt Ltd.