Reading Time: 2 minutes
OTT: ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్.. పెళ్లైన ప్రతిసారీ కోడలికి అదే గతి.. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది

హారర్, మిస్టరీ, సస్పెన్స్ కథలను ఇష్టపడే వారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న నిడివితో, వేగవంతమైన కథనంతో సాగే థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో పెద్దగా హైప్ లేకుండానే ఓటీటీలోకి వచ్చిన ఓ కన్నడ హారర్ మిస్టరీ సిరీస్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రతి కోడలికి అనూహ్యమైన విషాదం ఎదురవుతుండటంతో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతోందనే ప్రశ్న కథను ముందుకు నడిపిస్తుంది. సాధారణ దెయ్యాల కథలకు భిన్నంగా కుటుంబ సంబంధాలు, అనుమానాస్పద మరణాలు, ఇంట్లో దాగి ఉన్న రహస్యాలను కలిపి సిరీస్ ను రూపొందించారు. ముఖ్యంగా ఒక్కో ఎపిసోడ్ చిన్న నిడివితో ఉండటంతో కథ ఎక్కడా సాగదీసినట్లు అనిపించదు. మొదటి నుంచి చివరి వరకు సస్పెన్స్‌ను కొనసాగించేలా స్క్రీన్‌ప్లే సాగుతుంది.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ఈ సినిమా కథ విషయానికొస్తే.. కథలో జాజి అనే యువతికి దుష్యంత్‌తో వివాహం జరుగుతుంది. పెళ్లి తర్వాత ఆమె తన భర్తతో కలిసి ఆయన ఓ పాత బంగ్లా ‘అయ్యన మనే’ కు వస్తుంది. అయితే అక్కడ అడుగుపెట్టిన కొద్దిసేపటికే ఊహించని విషాదం చోటుచేసుకుంటుంది. జాజి అత్తారింట్లోకి వచ్చిన వెంటనే ఆమె మామగారు మరణిస్తారు. ఆ ఘటనతో ఆమెకు ఆ ఇంటి వాతావరణంపై అనుమానాలు మొదలవుతాయి. ఇంట్లోని కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా ఆమెకు అంతుపట్టదు. ఒక్కొక్కరి ప్రవర్తన వెనుక ఏదో దాగి ఉందని ఆమెకు అర్ధమవుతుంది. ఆ తర్వాత జాజికి ఇంట్లో పనిచేసే పనిమనిషి చెప్పే విషయం మరింత భయపెడుతుంది. దుష్యంత్‌కు ఇది మొదటి వివాహం కాదని, గతంలో అతడిని పెళ్లి చేసుకున్న మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిందని ఆమెకు తెలుస్తుంది. అంతేకాదు.. ఆ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన మహిళలకు వరుసగా చనిపోతారని జాజికి అర్థమవుతుంది. గతంలో వచ్చిన ముగ్గురు కోడళ్లు కూడా ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుసుకుంటుంది.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

కథ ముందుకు సాగుతున్న కొద్దీ జాజికి ఇంట్లో ప్రతి ఒక్కరిపైనా అనుమానాలు మొదలవుతాయి. ముఖ్యంగా కుటుంబంలోని పెద్దల ప్రవర్తన ఆమెకు అంతుచిక్కకుండా ఉంటుంది. గతంలో జరిగిన మరణాల వెనుక ఎవరి పాత్ర ఉంది. ? ఆ ఇంట్లోకి వచ్చే కోడళ్లకే ఎందుకు ప్రమాదాలు ఎదురవుతున్నాయి.? ఈ ఘటనలన్నింటికీ అత్తగారికి ఏమైనా సంబంధం ఉందా.? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ఈ మిస్టరీకి సమాధానం తెలుసుకోవడానికి ఆమె ఏం చేసింది. చేసే ప్రతి ప్రయత్నంతో ఇంటికి సంబంధించిన మరో కొత్త రహస్యం బయటపడుతూ కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఆ సిరీస్ పేరే అయ్యన మనే. కన్నడలో తెరకెక్కిన ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ప్రస్తుతం జీ5లో తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది. అయ్యన మనే సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు 18 నుంచి 20 నిమిషాల నిడివితో ఉంటుంది. తక్కువ రన్‌టైమ్‌లోనే కథను వేగంగా నడిపించడం ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.