Reading Time: 4 minutes
Tn Seshan The Man Who Transformed Indian Elections Explained Amid Gyanesh Kumar Row

ఇప్పుడంటే ఎన్నికల కమిషన్…చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి గానీ… భారత ఎన్నికల వ్యవస్థను ప్రపంచం మొత్తం శభాష్ అని మెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయ్..ఎన్నికలు ఎలా నిర్వహించాలో ప్రపంచ దేశాలకు మనవాళ్లు వెళ్లి పాఠాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయ్. గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్‌ను గుర్తు తెచ్చుకుంటే వినిపించే ఒకే ఒక్క పేరు TN శేషన్. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్… ఈసీని రాజ్యాంగబద్ధంగా నడిపించడం లేదని విమర్శలు గుప్పుమంటున్న సమయంలో టీఎన్ శేషన్‌ను గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దేశ ఎన్నికల చరిత్రలో టీఎన్ శేషన్‌ది ప్రత్యేక చరిత్ర.

TN SESHAN….ఈ పేరు తలచుకుంటేనే రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెతాయి..ఆయన ప్రస్తావన తెస్తేనే…అధికారులు భయంతో పారిపోతారు. ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అన్న డైలాగ్ గుర్తిందిగా…సేమ్ అలానే… టీఎన్ శేషన్ అనే ఒకే ఒక్కడు దేశ రాజకీయ వ్యవస్థతో పాటు అధికారులను గడగడలాడించారు .I EAT POLITICIANS FOR BREAKFAST అని ప్రకటించి రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిన వాడు టీఎన్ శేషన్. ఎలక్షన్ కమిషన్ అంటే రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో ఉండే వ్యవస్థ కాదని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే వెన్నెముక ఉన్న వ్యవస్థ అని ప్రాక్టికల్ గా నిరూపించారు TN శేషన్.

1990లో టీఎన్ శేషన్… ఎలక్షన్ కమిషనర్ గా ఈసీ కార్యాలయంలో అడుగుపెట్టినప్పుడు.. మరో రొటీన్ నియామకమే అనుకున్నారు అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్…కానీ కొన్ని రోజులకే… ఆయనతో పాటు చాలా మందికి అర్థమైంది… టీఎన్ శేషన్…రాజకీయ నాయకులకు సింహస్వప్నమని…ఆయన్ను లొంగదీసుకోవడం అంత ఈజీ కాదని…!

శేషన్‌కు ముందు ఎన్నికలు జరిగాయి… శేషన్ తర్వాత కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ..అయినా టీఎన్ శేషన్ మాత్రమే ఎందుకు చరిత్రలో నిలిచిపోయారో తెలుసా…??? ఎందుకంటే ఆయన రాజ్యాంగానికి కట్టుబడి పనిచేశారు దేశం కోసం ప్రజల కోసం పనిచేశారు.. అంతిమంగా ప్రజాస్వామ్యానికి ప్రాణం పోశారు. అందుకే.. తన పనికి అడ్డుతగిలిన వాళ్లకు చట్ట ప్రకారం పని చేయని వాళ్లకు చుక్కలు చూపించారు. TN Seshan effect ఆ రోజుల్లో దేశ రాజకీయ వ్యవస్థపై ఏ స్థాయిలో ప్రభావం చూపించిందంటే రాజకీయ నాయకులు కేవలం ఇద్దరంటే ఇద్దరికే భయపడేవారంట… ఒకరు కనిపించని దేవుడు.. రెండు టీఎన్ శేషన్. ఇదీ ఆయనకున్న ట్రాక్ రికార్డ్. రాజ్యాంగ పదవులు చేపట్టిన చాలా మంది బ్యూరోకాట్స్ తమకు ఆ అవకాశం కల్పించిన రాజకీయ వ్యవస్థ ముందు అణిగిమణిగి ఉంటారు. అవసరమైతే వాళ్ల కోసం తమ విధుల్లో రాజీ కూడా పడతారు… కానీ టీఎన్ శేషన్ కు రాజ్యాంగం ఏది చెబితే అదే ఫైనల్… అందుకే

I am not the chief election commission of the government of India.. I am chief election commission India అని ధైర్యంగా ప్రకటించారు టీఎన్ శేషన్… తాను రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటానని…ఎవరి ముందు తలవంచుకోనని కుండబద్దలు కొట్టిన మొనగాడు టీఎన్ శేషన్. టీఎన్ శేషన్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టకముందు… ఎన్నికల వ్యవస్థను పాలిటిక్స్ డామినేట్ చేసేవి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల మాటలు చెల్లుబాటు అయ్యేవి కావు…. ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికలు హింసాత్మకంగా మారేవి. మనీ పవర్… మజిల్ పవర్ ఈ రెండింటిని ప్రదర్శించి… ఎన్నికలను రాజకీయ నేతలు తమ కనసన్నల్లోనే పెట్టుకునేవారు… కానీ టీఎన్ శేషన్ ఈసీ అయిన తర్వాత పిక్చర్ మొత్తం మారిపోయింది…

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నూటికి నూరుశాతం అమలుల్లోకి తెచ్చారు. అప్పటి వరకు ఎన్నికల్లో ఏరులైన పారిన మద్యానికి అడ్డుకట్ట వేశారు. బోకస్ ఓట్లను ఏరివేసేందుకు.. ఫోటో ఓటర్ ఐడీ కార్డులను ప్రవేశపెట్టారు… ఎన్నికల్లో ధన ప్రవాహంపై నిఘా పెట్టారు. రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో 1991లో ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేశారు. ఎన్నికల వ్యవస్థలో దాదాపు 150కిపైగా లోపాలను గుర్తించి వాటిని ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వచ్చారు. ఎన్నికల్లో గీత దాటితే రాజకీయ నాయకులను జైలుకు పంపించారు. వాళ్లు ఎంతటి వారైనా సరే… ఐ డోన్ట్ కేర్ అన్నట్టు వ్యవహరించేవాళ్లు…

1994లో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకి కూడా టీఎన్ శేషన్ షాక్ ఇచ్చారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న కారణంతో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సీతారాం కేసరి…కల్పనాథ్ రాయ్‌లకు ఉద్వాసన పలకాలని పీవీ కి సిఫార్సు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు శేషన్. ఎన్నికల విధుల్లో అధికారులు అక్రమాలకు పాల్పడితే వెంటనే వాళ్లను సస్పెండ్ చేయించారు. ఎవరైనా డిసిప్లిన్ తప్పినట్టు రుజువైతే వాళ్లతో చాలా కఠినంగా వ్యవహరించే వారు టీఎన్ శేషన్..

ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలతో పాటు… ఎన్నికల నిర్వహణలో ఉన్న సిబ్బంది కూడా శేషన్ కు సహకరించేవారు కాదు. దీంతో శేషన్ న్యాయపోరాటం చేశారు. ఏ విభాగంలో పనిచేస్తున్నా సరే… ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు… ప్రభుత్వ అధికారులు…సిబ్బందిపై పూర్తి స్థాయి అజమాయిషీ ఈసీదేనని సుప్రీం కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అధికారులను బదిలీ చేయడం…సస్పెండ్ చేయడం.. సొంత కేడర్ కు పంపించడం..వాళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వరకు అన్నీ ఈసీనే చూసుకుంటుందని సుప్రీం తేల్చి చెప్పింది…టీఎన్ శేషన్ పోరాటం తర్వాత మాత్రమే డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది.

1991 లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలను ఈసీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో భాగమైన…దాదాపు 3.5 మిలియన్ ఉద్యోగులను ఈసీ తన పరిధిలోకి తీసుకుంది. తమ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనంటూ శేషన్ హుకుం జారీ చేశారు. ఈ విషయంలో శేషన్ కు సహకరించేందుకు నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం ఆయన వైఖరిపై మండి పడింది. అయినా సరే శేషన్ వెనకడుగు వేయలేదు. రాజ్యాంగానికి తప్ప దేని ముందు తలవంచని శేషన్…తన పంథాలో పనిచేసుకుంటూ వెళ్లారు.

అయితే 1993లో తమిళనాడు లోని రాణిపేట్ నియోజకవర్గం ఉప ఎన్నికల సమయంలో ఈసీ వర్సెస్ కేంద్రం వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. నియోజకవర్గానికి వెళ్లనీయకుండా తమ వాళ్లను జయలలిత పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని.. ఉపఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను మోహరించాలని ప్రతిపక్ష నేతలు ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని శేషన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన వైఖరితో ఆగ్రహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం… సెంట్రల్ ఫోర్సెస్‌ను అడిగే అధికారం మీకు లేదంటూ లేఖ రాసింది. దీంతో మండిపడ్డ శేషన్… ఎవరూ ఊహించని విధంగా అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంతో పంచాయితీ తేలేంత వరకూ 31 నియోకవర్గాల్లో ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. శేషన్ ఇలాంటి అసాధారణ నిర్ణయం తీసుకుంటారని అటు కేంద్ర ప్రభుత్వం గానీ..ఇటు తమిళనాడు ప్రభుత్వం గానీ ఊహించలేదు…

రాజకీయ నేతలు ఎన్ని నీతి వాక్యాలు వల్లెవేసినా.. చివరకు రాజ్యాంగ సంస్థలు కూడా తమ చెప్పు చేతల్లో పని చేయాలని కోరుకుంటారు… అయితే శేషన్ మాత్రం తన హయాంలో ఎవరికి లొంగలేదు… నేను చట్టానికి లోబడి పనిచేస్తున్నాను… నీ ఇష్టం ఉన్నది చేస్కో అన్నట్టు ఉండేది టీఎన్ శేషన్ వైఖరి. శేషన్ ముక్కుసూటి తనం… నిజాయితీ స్వభావం …చాలా మంది రాజకీయాలకు పొగరుగా కనిపించేది. అందుకే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత… టీఎన్ శేషన్ ను embodiment of arrogance అంటూ ఓ సందర్భంలో సంబోధించారు. అంటే అహంకారానికి నిలువెత్తు రూపం అన్నమాట..

ఎన్నికల కమిషన్ గాడి తప్పిందని…ఓట్ల చోరీకి పాల్పడుతుందని… ప్రస్తుతం కాంగ్రంస్ పార్టీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే టీఎన్ శేషన్… నిక్కచ్చిగా వ్యవహరించి ఎన్నికల వ్యవస్థను గాడిన పెట్టడం కూడా…నాటి కాంగ్రెస్ పాలకులకు నచ్చలేదన్నది చరిత్ర మర్చిపోని నిజం…టీఎన్ శేషన్ ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారని భావించిన…అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు….ఆయన అధికారాలకు కత్తెర వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అప్పటి వరకు ఏకసభ్య కమిషన్ గా ఉన్న ఎన్నికల కమిషన్ ను త్రిసభ్య కమిషన్ గా మార్చేశారు. 1993లో ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్రపతి ఆమోదం పొందేలా చేసి… ఎంఎస్ గిల్… జీవీజీ కృష్ణమూర్తిలను ఎన్నికల కమిషనర్లుగా నియమించారు.

Must find best man as CEC…TN Seshan happens once in a while…సుప్రీం కోర్టు ఓ సందర్భంలో అన్న మాటలివి… ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎన్నికల సంస్కరణలతో ఈసీకి జీవం పోసిన ఘనత టీఎన్ శేషన్ కే దక్కుతుంది. ఎన్నికల కమిషనర్లు వస్తుంటారు…పోతుంటారు… కానీ శేషన్ లాంటి వాళ్లు చాలా అరుదు… అలాంటి వ్యక్తి కి బాధ్యతలు అప్పగించడం అంటూ 2022లో సుప్రీం కోర్టు ఓ కేసు విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు శేషన్ ఇంటిగ్రిటీకి అద్దంపడతాయి.

గతంలో బీహార్ ఎన్నికల సమయంలో టీఎన్ శేషన్ ఏమన్నారో తెలుసా….? …We will stop elections in Bihar even if there is 1% doubt or rigging and start all over again…ఇదీ ఎన్నికల నిర్వహణలో శేషన్‌కి ఉన్న కమిట్‌మెంట్.

క్రికెట్ మ్యాచ్ లో రిఫరీ నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే ఆ మ్యాచ్ ఫెయిర్‌గా జరుగుతుందా…? మన దేశానికి కావాల్సింది కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఎన్నికల కమిషనర్లు కాదు… ఎవరికీ గులాంగిరీ చేయకుండా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే వెన్నెముక ఉన్న డేరింగ్ అండ్ డాషింగ్ అధికారులు….జస్ట్ లైక్ టీఎన్ శేషన్ అలాంటి అధికారుల చేతుల్లోకి రాజ్యాంగ వ్యవస్థలు వెళ్లాలని…కోరుకుందాం…!!