
న్యూయార్క్: తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 81వ వార్షిక సమావేశంలో ప్రపంచ దేశాల నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
దక్షిణాసియాలో కాశ్మీర్ సమస్యతో సహా అన్ని వివాదాలను ఐక్యరాజ్యసమితి చార్టర్, సంబంధిత తీర్మానాల పరిధిలో చర్చల ద్వారానే పరిష్కారమైతాయని పేర్కొన్నారు. ఎర్డొగన్ యూఎన్ వేదికగా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం ఇదే ఫస్ట్ టైం కాదు.
గతేడాది సెప్టెంబర్‌లోనూ ఆయన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం అవసరమన్నారు. అంతకుముందు 2020లో కూడా ఎర్డొగన్ వీడియో సందేశం ద్వారా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా.. ఇండియా తీవ్రంగా ఖండించింది. కాశ్మీర్ అనేది భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక అంశమని, ఇందులో ఇతర దేశాల జోక్యం అక్కర్లేదని మరోసారి భారత్ స్పష్టం చేసింది.