Reading Time: 2 minutes
Vadivelu Reveals Feud With Dhanush Third Person D56 Pooja

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 56వ సినిమా (D56) పూజా కార్యక్రమాలు మధురైలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఈవెంట్ లో లెజెండరీ కమెడియన్ వడివేలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. తన కెరీర్ లో ధనుష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వడివేలుకి ఇదే తొలిసారి. ఈ అద్భుతమైన కాంబినేషన్ సెట్ అవ్వడానికి ఎందుకింత సమయం పట్టిందన్న విషయంపై వడివేలు స్వయంగా క్లారిటీ ఇస్తూ బాంబు పేల్చారు. “చాలా సుదీర్ఘ విరామం తర్వాత ధనుష్ తో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. మా ఇద్దరి కలయికకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని మీరంతా అడగొచ్చు. దానికి కారణం ఒక మూడో వ్యక్తి (థర్డ్ పర్సన్). ఆ వ్యక్తి సృష్టించిన అపోహల వల్లే మా మధ్య ఇన్నాళ్లూ గొడవలు (మిస్ అండర్ స్టాండింగ్స్) జరిగాయి” అని వడివేలు ఓపెన్ అయ్యారు. ఆ మూడో వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మధురైలోని మారనాడు కరుప్పన్నస్వామి ఆలయంలో అభిమానుల కోలాహలం మధ్య ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ధనుష్ ఏకంగా 18 అడుగుల భారీ కొడవలిని స్వామివారికి కానుకగా సమర్పించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. పక్కా విలేజ్, రూటెడ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ‘రాయన్’ తర్వాత మరోసారి ఎస్.జె. సూర్య ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా, ప్రీతి ముకుందన్, విజయ్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యంత బిజీగా ఉన్న నటుల్లో ధనుష్ ముందు వరుసలో ఉన్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్టర్ 1’ (OM: Chapter 1). మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా లాంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ ద్విభాషా చిత్రం వాస్తవానికి అక్టోబర్ 16న రావాల్సింది. కానీ, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’, హీరో సూర్య దీపావళి రిలీజ్ ‘సీన్’ చిత్రాలకు గౌరవమిస్తూ.. వారికి పోటీగా వెళ్లకూడదనే ఉద్దేశ్యంతో ధనుష్ తన సినిమాను వాయిదా వేసుకున్నారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు.