టమాటా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం, ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. అందులో నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత అందులో మెంతులు, ఆవాలు జీలకర్ర, వెల్లుల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు రెమ్మలు వేసి మంచిగా కలుపుకోవాలి. అందులోనే ఒక ఎండుమిరపకాయను ముక్కలుగా చేసి, మూడు పచ్చిమిరపకాయ చీలికలను వేసి ఫ్రై చేయండి. ఆ వెంటనే ఒకటి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను మంచిగా కలుపుకోవాలి
పోపు బాగా ఫ్రై అయిన తర్వాత, పావు టీస్పూన్ పసుపును వేసి ఒకసారి కలపాలి. ఆ తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన టమాటాలను చేర్చాలి. టమాటాలను వేసిన తర్వాత బాగా కలిపి, మూతపెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. ఇలా నూనెలో టమాటా ముక్కలను ఉడికించడం వల్ల అవి బాగా సాఫ్ట్‌గా ఉడుకుతాయి, కర్రీ కూడా చాలా అద్భుతంగా రుచికరంగా ఉంటుందంట.
తర్వాత టమాటాలు కాస్త ఉడికిన తర్వాత అందులో రుచికి సరిపడ, ఉప్పు, కారం యాడ్ చేయాలి. తర్వాత మెంతి పొడి, మసాలా పొడి, ధనియాల పొడి కూడా చేర్చాలి. ఇలా చేర్చడం వలన కర్రీ మంచిగా రుచికరంగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలి అనిపిస్తుంది. మసాలాలు యాడ్ చేసిన తర్వాత, ఇప్పుడు మళ్లీ మూతపెట్టి ఐదు నుండి ఆరు నిమిషాల పాటు కర్రీని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి.
ఈ కూరలో మనం నీరు వేయలేదు కాబట్టి, మధ్య మధ్యలో కలుపుతూ టమాటాని ఈవెన్‌గా ఉడికించాలి. సుమారు ఏడు నిమిషాల తర్వాత టమాటా పూర్తిగా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. అప్పుడు గంటెతో కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా చేస్తూ మిక్స్ చేయండి. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత, చివరిగా ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకును, ఒక టీస్పూన్ ధనియాల పొడిని వేసి బాగా కలపాలి. కొంతమంది ఇందులో కొంచెం మెంతి ఆకును కూడా వేస్తారు, అలా చేసినా కూర రుచి చాలా బాగుంటుంది.
అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి టమాటా కర్రీని సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసిన టమాటా కర్రీని అన్నం, చపాతీ, పూరీతో ఏ కాంబినేషన్ తో తీసుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకోండి.




