Reading Time: < 1 minute
Ganesh Nimajjanam 2026 Live: భాగ్యనగరం వినాయక నిమజ్జన మహోత్సవానికి సర్వం సిద్ధం!

భాగ్యనగరంలో వినాయక నిమజ్జన మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ 25న నగరంలో భారీ శోభాయాత్ర జరగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఖైరతాబాద్ మహాగణపతితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాల నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ప్రత్యేక వేదికలు, క్రేన్లు, బారికేడ్లు, లైటింగ్, మొబైల్ టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు అదనపు క్రేన్లను అందుబాటులో ఉంచారు.

భారీగా తరలివచ్చే భక్తుల కోసం పోలీసులు విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. నగరవ్యాప్తంగా 20 వేల మందికి పైగా పోలీసులను మోహరించగా.. 10 వేలకు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగనుంది. కీలక ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ బృందాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ బలగాలను కూడా అందుబాటులో ఉంచారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో సేవలను పొడిగించారు. మరోవైపు ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 10 గంటల వరకు ప్రధాన మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రజలు వీలైనంత వరకు మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ వంటి ప్రజా రవాణాను వినియోగించాలని అధికారులు సూచించారు.

మొత్తంగా.. భక్తుల భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..