Reading Time: < 1 minute

ఫ్యాన్స్కి షాకిచ్చిన కోహ్లీ: నా కెరీర్‌లో ఇదే చివరి వరల్డ్‌కప్.. రిటైర్మెంట్ అప్పుడే!

Caption of Image.

Virat Kohli Retirement: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అంశంపై సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది (2027) జరగనున్న వన్డే ప్రపంచకప్‌తో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు కోహ్లీ స్పష్టం చేశారు. జియోస్టార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాన్ని వెల్లడించడంతో క్రికెట్ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ స్టార్ట్ అయింది. 

నా కెరీర్‌లో ఇదే చివరి వరల్డ్‌కప్: కోహ్లీ

భవిష్యత్తు ప్రణాళికల గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇది విదేశీ పరిస్థితుల్లో జరుగుతోంది. ఇది మీ నుంచి చాలా శ్రమను కోరుకుంటుంది. నా దేశం తరఫున నేను ఆడబోయే చివరి వరల్డ్‌కప్ ఇదే.. అదే నాకు అతిపెద్ద ప్రేరణ.. మైదానంలో నా సర్వశక్తిని ధారపోయాలని అనుకుంటున్నాను అని కింగ్ కోహ్లీ పేర్కొన్నారు.

కోహ్లీ వరల్డ్‌కప్ జర్నీ: 

* 2008లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. 2011లో తన తొలి వన్డే ప్రపంచకప్‌ను ఆడాడు. ఆ టోర్నీలో బంగ్లాదేశ్‌పై అద్భుతమైన సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.

* ఇక 2011 ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిలోనూ కీలకమైన 35 రన్స్ చేసి, గౌతమ్ గంభీర్‌తో కలిసి 3 వికెట్‌కు 83 పరుగులు జోడించాడు. ఫలితంగా 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్‌ను ముద్దాడటంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.

* ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచకప్‌లోనూ సీనియర్ ఆటగాడిగా బరిలోకి దిగిన కింగ్ కోహ్లీ.. పాకిస్థాన్‌పై అద్భుతమైన సెంచరీతో క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేశాడు. కానీ ఆ టోర్నీ సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. 

* ఇప్పుడు తన కెరీర్‌లో ఆఖరి మెగా టోర్నీగా భావిస్తున్న 2027 వన్డే ప్రపంచకప్‌ను భారత్‌కు మరోసారి అందించడమే లక్ష్యంగా విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు.  

©️ VIL Media Pvt Ltd.