Reading Time: < 1 minute

రెండు డీఎల విడుదల నిర్ణయంపై జేఏసీ చైర్మన్‌‌ లచ్చిరెడ్డి హర్షం

Caption of Image.
  • డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జేఏసీ చైర్మన్‌‌ లచ్చిరెడ్డి

ట్యాంక్‌‌బండ్‌‌, వెలుగు: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ప్రధాన సమస్యల పరిష్కారంలో భాగంగా రెండు డీఏలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఓపీఎస్‌‌పై కమిటీ ఏర్పాటు చేయడం, పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించి అమలు దిశగా చర్యలు చేపట్టడం సంతోషదాయకమని పేర్కొంది. ఈ మేరకు జేఏసీ చైర్మన్‌‌ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్‌‌ వి. రాజశేఖర్‌‌ ఆధ్వర్యంలో ప్రతినిధులు గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి ప్రభుత్వ నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయబద్ధమైన సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇదే విధమైన సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.