Reading Time: 2 minutes

Vijay Deverakonda:’రణబలి’ రిలీజ్ డేట్ ను మార్చేది లేదు.. విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పోస్టర్ అవుట్!

Caption of Image.

టాలీవుడ్  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘ట్యాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఏవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబలి’. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. అంతే కాదు ముందే ప్రకటించినట్లుగానే అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఈ నయా పోస్టర్‌లో విజయ్ నుదుటన తిలకం దిద్దుతూ అత్యంత తీవ్రమైన, రఫ్ అండ్ టఫ్ అవతారంలో కనిపిస్తున్నారు. 19వ శతాబ్దపు నాటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దౌర్జన్యాలు, వారి వల్ల ఏర్పడిన తీవ్రమైన కరువు, ఆహార సంక్షోభం నేపధ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. బ్రిటిష్ అధికారులపై తిరగబడే వీరుడి పాత్రలో విజయ్ కనిపించనున్నారు..

ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ ‘ఏందయ్య సామి’ చార్ట్‌బస్టర్‌గా నిలిచి, సంగీతప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయ్-రష్మిక హిట్ కాంబో స్క్రీన్ పై చూపించబోయే కెమిస్ట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్-అతుల్  సంగీతం అందిస్తున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’తర్వాత విజయ్-రష్మికల హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ పీరియాడిక్ అడ్వెంచర్ థియేటర్లలో రికార్డుల సునామీ సృష్టించడం ఖాయం అని సినీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.