
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ-సోషల్ యాక్టివిటీస్ (యాంటీ-గూండా) బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెనక్కి పంపింది. పున:పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపడంతో యాంటీ గూండా చట్టానికి తాత్కాలికంగా బ్రేక పడింది.
ఈ బిల్లులో NDPS చట్టం-1985 కింద నేరాలకు పాల్పడిన వారిని ‘గూండా’ అని సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర చట్టం PITNDPS-1988తో ఇది ఓవర్ లాప్ (overlap) అయ్యే అవకాశం ఉందని అభ్యంతరం తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం చట్టాల మధ్య వైరుధ్యానికి దారితీయవచ్చని పేర్కొంది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత నిబంధనల్లో సవరణలు చేసి బిల్లును మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి ఉంది. జూన్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పటికీ చట్టంగా అమల్లోకి రాలేదు.
ఇదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసేవారి ఆస్తులను జప్తు చేసి మూడు రెట్ల నష్టపరిహారం వసూలు చేసే మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ (సవరణ) బిల్లుకు నోటిఫికేషన్ జారీ అయి పశ్చిమ బెంగాల్‌లో అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.