బుల్లితెర సీరియల్స్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కథాంశాలతో ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కథలు కొన్ని సందర్భాల్లో రొటీన్‌గా అనిపించినప్పటికీ.. నటీనటుల సహజమైన నటన, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కారణంగా ఆయా సీరియల్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా సీరియల్ నటీనటులకు కూడా సినిమాల హీరోహీరోయిన్ల తరహాలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది.
బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న పలువురు నటీనటులు వెండితెరపై అవకాశాలు అందుకుంటుండగా.. మరికొందరు సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ అమూల్య గౌడ ఒకరు. తెలుగులో ఈమెను చూసినవారికి మాత్రం ‘మీనా’ అంటేనే వెంటనే గుర్తొస్తుంది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్లో మీనా పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్లో అమూల్య గౌడ ఒక అమాయకమైన, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది.
తన నటనలో సహజత్వాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పెర్ఫార్మెన్స్కు మంచి స్పందన వస్తోంది. తెలుగులోకి వచ్చిన కొద్ది కాలంలోనే తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమూల్య.. అంతకుముందే కన్నడ బుల్లితెరపై మంచి పేరు సంపాదించుకుంది. అమూల్య గౌడ కన్నడ టెలివిజన్ రంగంలో ‘శ్రీగౌరీ’ సీరియల్‌తో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత పలు కన్నడ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా కన్నడ బిగ్ బాస్ కార్యక్రమంలోనూ పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం తెలుగు సీరియల్‌తో బిజీగా ఉన్న ఈమె.. ఇటు నటనతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. సీరియల్లో ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లో, ముఖ్యంగా చీరకట్టులో కనిపించే అమూల్య గౌడ.. సోషల్ మీడియాలో మాత్రం పూర్తిగా భిన్నమైన లుక్‌లో దర్శనమిస్తుంది. మోడ్రన్ అవుట్‌ఫిట్స్, స్టైలిష్ ఫొటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమెకు సంబంధించిన గ్లామరస్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సీరియల్లో కనిపించే అమూల్యకు, సోషల్ మీడియాలో కనిపించే అమూల్యకు చాలా తేడా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అమూల్య గౌడకు సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నట్లు తెలుస్తోంది.సీరియల్లో తన సహజమైన నటనతో మెప్పిస్తూ.. సోషల్ మీడియాలో తన స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న అమూల్య గౌడకు రోజురోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. దీంతో ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్లో మీనా పాత్రతో తెలుగు ప్రేక్షకుల్లో మరింత పాపులర్ అవుతోంది.




