Reading Time: 2 minutes
Netanyahu Un Speech Pager Hezbollah Delegates Walkout

Netanyahu at UN: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో చాలా దేశాలకు చెందిన ప్రతినిధులు బాయ్‌కాట్ చేశారు. ఈ నేపథ్యంలో నెతన్యాహూ ప్రసంగిస్తూ ‘‘పేజర్’’ను చూపించారు. 2024లో హిజ్బుల్లా‌పై ఉగ్రవాదులు ఒకే సమయంలో అనేక పేజర్లు పేలి మరణించారు. చాలా మంది గాయపడ్డారు. అప్పట్లో ఇజ్రాయిల్ చేపట్టిన ఈ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం మారింది.

నెతన్యాహూ ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ.. గత మూడేళ్లలో ఇజ్రాయిల్ 7 వైపుల యుద్ధం చేసిందని అన్నారు. న్యూజెర్సీ రాష్ట్ర పరిమాణంలో ఉన్న దేశం 7 వైపులా ఇంతకాలం యుద్ధం చేయగలదా? అని వ్యాఖ్యానించారు. తన ప్రసంగంలో ఇరాన్, హమాస్, టర్కీతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య దేశాలపై కూడా నెతన్యాహూ విమర్శలు గుప్పించారు. తమను అంతం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, ఇజ్రాయిల్ అమెరికా మద్దతుతో వాటిని ప్రతిఘటించిందని ఆయన అన్నారు.

నెతన్యాహూ ప్రసంగం బాయ్‌కాట్:

నెతన్యాహూ ప్రసంగం చేస్తున్న సమయంలో చాలా దేశాల ప్రతినిధులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. కొందరు అక్కడే ఉంది ఆయనకు మద్దతుగా చప్పట్లు కొట్టారు. బయటకు వెళ్తున్న వారిని ఉద్దేశిస్తూ నెతన్యాహూ ‘‘ధైర్యం లేని పిరికవాళ్లు’’ అని అన్నారు. ఇరాన్‌పై నెతన్యామూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ను ‘‘హత్యలకు పాల్పడే నియంతృత్వ ప్రభుత్వం’’ అని ఆరోపించారు. ఇజ్రాయిల్ ఇరాన్ అణ్వాయుధాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఇరాన్ ప్రస్తుత పాలన వ్యవస్థ పతనం ఎంతో దూరంలో లేదని అన్నారు.

సంచలనంగా మారిన ‘‘పేజర్’’..

ప్రసంగం మధ్యలో నెతన్యాహూ ‘‘పేజర్’’ను చూపించడం సంచలంగా మారింది. 2024లో లెబనార్‌లోని హిజ్బుల్లా దారుణంగా దెబ్బతినడానికి పేజర్ అటాక్ కూడా ఒక కారణం. పేజర్‌లు ఒక్కసారిగా పేలడంతో చాలా మంది హిజ్బుల్లా కార్యకర్తలు మరణించారు. పలువురు అవయవాలు కోల్పోయారు. ఈ ఘటనలో 3000 మంది గాయపడినట్లు పలు మీడియాలు నివేదించాయి. ఇజ్రాయిల్ మొసాద్ 5000 పేజర్లలో ముందుగానే పేలుడు పదార్థాలు అమర్చి, అవి హిజ్బుల్లాకు చేరేలా చేసినట్లు తెలుస్తోంది. నెతన్యాహూ మరోసారి పేజర్‌ను చూపిస్తూ ‘‘బీపర్లు గుర్తున్నాయా??’’ అంటూ ఆ ఘటనను గుర్తుచేశారు.

టర్కీ, మమ్దానీపై విమర్శలు:

టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్‌పై నెతన్యాహూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను హమాస్‌కు మద్దతు ఇస్తున్నాడని అన్నారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కారణంగా న్యూయార్క్ నగరంలోని యూదులు సురక్షితంగా లేరని అన్నారు.