
హైదరాబాద్, వెలుగు: అమెజాన్ క్విక్ డెలివరీ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ ను తెలుగు రాష్ట్రాల్లో విస్తరించింది. సంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, కడప ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ‘
నిమిషాల వ్యవధిలోనే కిరాణా వస్తువులు, పండ్లు, కూరగాయలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు డెలివరీ చేస్తారు. భారత్‌లో ఈ విభాగం ఏడాదికి 100 కోట్ల డాలర్ల వ్యాపారాన్ని దాటింది. దీపావళి నాటికి 100 నగరాలకు ఈ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభం అవుతుందని అమెజాన్ తెలిపింది.