
తరం మారే కొద్ది అడ్వాన్స్, అప్డేట్ అవుతారని అంటారు.. రేపటి తరం కూడా ముందుగానే అప్డేట్ అవుతోంది. ఎలా అంటే పోలీసులు ఏదైతే వద్దంటారో అదే చేస్తూ.. రూల్స్ గీల్స్ జాంతా నై.. అన్నట్లుగా తయారయ్యారు. ఉత్తరప్రదేశ్ లో స్కూల్ స్టూడెంట్స్ ఒకే బైక్ పై ఆరు మంది స్టంట్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యూపీలోని మీరట్ లో ఒకే బైక్ పై ఆరు మంది విద్యార్థులు స్టంట్స్ చేస్తూ కనిపించారు. బైక్ పై 5 మంది కూర్చోగా.. ఒకడు వాళ్ల భుజాలపై కూర్చొని చాలా డేంజర్ గా వెళ్తుండటం స్థానికులను షాకింగ్ కు గురిచేసింది. అలా వెళ్తున్న వారికి భయం వేసిందో లేదో కానీ.. వీళ్ల విన్యాసాలు చూసిన వాళ్లు భయాందోళనకు గరయ్యారు.
వీడియో వైరల్ గా మారటంతో విచారణ చేపట్టిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. సదరు వాహనాన్ని సీజ్ చేసి.. 25 వేల రూపాయల ఫైన్ విధించినట్లు మీరట్ ఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాత్సవ చెప్పారు. విద్యార్థులను తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాళ్లపైన కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
गिन कर बताइए एक बाइक पर कितने लोग सवार है
वीडियो मेरठ की है सोशल मीडिया पर वायरल है। और बाइक पर सवार सभी छात्र है
लेकिन इस लापरवाही का जिम्मेदार जितने ये छात्र है उतने ही जिम्मेदार इनके पैरेंट्स भी है#meerut pic.twitter.com/KGgZxA5t4v
— Sudhir Chauhan (@sudhirstar) September 24, 2026