Reading Time: < 1 minute

చైనా, అమెరికా ప్రత్యర్థులు కాదు..పార్టినర్స్ : అమెరికా పర్యటనలో జిన్ పింగ్

Caption of Image.

మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. చైనా, అమెరికా  దేశాలు ప్రత్యర్థులు కాదని.. భాగస్వాములని అన్నారు.  అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లోని బేస్ అండ్రూస్ లో ప్రత్యేక విమానంలో దిగిన జిన్ పింగ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు. సతీసమేతంగా అమెరికా పర్యటనకు వెళ్లిన జిన్ పింగ్ కు అందరినీ ఎన్నడూ లేని విధంగా ఆశ్చర్యపరుస్తూ ట్రంప్ దంపతులు స్వాగతం పలికారు.

చైనా, అమెరికా ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆకాంక్షించారు. బుధవారం వాషింగ్టన్ చేరుకున్న జిన్ పింగ్ రాబోయే రోజుల్లో  చైనా, అమెరికా కలిసి ముందుకు సాగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.  చైనా, అమెరికా రెండు గొప్ప దేశాలని, రెండు దేశాల ప్రజలు గొప్పవారని జిన్ పింగ్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో రాశారు. 

మే నెలలో చైనా పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపర్చుకునేందుకు ట్రంప్ అంగీకరించినట్లు జిన్ పింగ్ తెలిపారు. ఆ దిశలో పని చేయాలని, పరస్పరం సహకరించుకోవాలని, శాంతియుత హామీలతో కూడిన స్థిరమైన సంబంధాన్ని పెంపొందించుకోవాలని జిన్ పింగ్ ఆకాంక్షించారు. 

©️ VIL Media Pvt Ltd.