
హైదరాబాద్, వెలుగు: పైరసీ మూవీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లను ఆర్థిక లావాదేవీల కోసం వినియోగించుకునేందుకు కోర్టు గురువారం అనుమతించింది.
ఖాతాలు ఫ్రీజ్ చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ రవి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్లను వినియోగించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని రవి కోరగా.. కోర్టు నిరాకరించింది. కేవలం ఆర్థిక లావాదేవీలకు మాత్రమే ఖాతాలను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.