
మెదక్ జిల్లాలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి రీఫిల్లింగ్ చేస్తున్న గోదాంపై సివిల్ సప్లయ్ అధికారులు దాడులు నిర్వహించారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లోని ఓ గ్యాస్ గోదాంలో శనివారం తనిఖీలు చేపట్టిన అధికారులు.. పెద్ద ఎత్తున అక్రమ సిలిండర్లను గుర్తించారు. మొత్తం 296 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
అధికారుల తనిఖీల్లో గోదాంలో గత కొంతకాలంగా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. రీఫిల్లింగ్ చేసిన సిలిండర్లను వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్‌ను నిల్వ చేయడంతో పాటు రీఫిల్లింగ్ నిర్వహిస్తున్నట్లు తేలడంతో అధికారులు చర్యలు చేపట్టారు.
ALSO READ : ఒకే బైక్‌పై ఆరుగురు స్కూల్ విద్యార్థులు..
గోదాంలో గ్యాస్ రీఫిల్లింగ్‌కు ఉపయోగిస్తున్న యంత్రాలు, ఇతర సామగ్రిని కూడా అధికారులు సీజ్ చేశారు. అక్రమ నిల్వలు, రీఫిల్లింగ్ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు.