
Rohingya Crisis: రోహింగ్యా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం అవరసమని బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. రోహింగ్యా సంక్షోభానిక మూలలాలు మయన్మార్‌లోనే ఉన్నాయని, అందువల్ల అక్కడే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. మయన్మార్ నుంచి దాదాపుగా 12 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అధిక జనాభా దేశమైన బంగ్లాదేశ్‌లో ఇంత మందికి ఆశ్రయం ఇవ్వడం వల్ల దేశ వనరులు, పర్యావరణం, భద్రత, సామాజిక సమాజాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.
రోహింగ్యాలు త్వరగా, సురక్షితంగా, గౌరవప్రదంగా మయన్మార్ తిరిగి వెళ్లేలా అంతర్జాతీయ సమాజం సహకరించాలని ఆయన కోరారు. అప్పటివరకు బంగ్లాదేశ్‌లో ఉంటున్న శరణార్థులకు అవసరమైన మానవతా సహాయాన్ని కొనసాగించాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. బంగ్లాలో ప్రస్తుతం 12 లక్షల మందికి పైగా రోహింగ్యాలు ఉన్నారని, వీరిలో చాలా మంది కాక్స్ బజార్‌లో ఉంటున్నారు. 2017లో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో భారీ హింస తర్వాత 7 లక్షల మంది బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు.